Asianet News TeluguAsianet News Telugu

వైఎస్ షర్మిలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదు.. అసలు ఏం జరిగిందంటే..

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని దళిత సంఘాల నాయకులు పోలీసులను  ఆశ్రయించారు. 

police complaint against YS Sharmila in jogipeta over her remarks on Andole MLA  Chanti Kranti Kiran
Author
First Published Oct 4, 2022, 9:41 AM IST

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని దళిత సంఘాల నాయకులు పోలీసులను  ఆశ్రయించారు. అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్‌‌ను షర్మిల అవమానించారని దళిత సంఘాలు, టీఆర్ఎస్ నాయయకులు జోగిపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలు.. షర్మిలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని స్థానిక దళిత సంఘం అధ్యక్షుడు సటికె రాజు, ఇతర ఎస్సీ నాయకులు.. జోగిపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

సెప్టెంబర్ 30న జోగిపేట పట్టణంలో నిర్వహించిన రోడ్‌షోలో షర్మిల క్రాంతి కిరణ్‌పై భూకబ్జాదారుడని దూషించారని రాజు ఆరోపించారు. అలాగే క్రాంతి కిరణ్‌పై అవమానకరమైన పదజాలం ఉపయోగించారని చెప్పారు. ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌‌పై షర్మిల అవమానకరంగా మాట్లాడారని.. అయితే పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేస్తారని తాను చాలా కాలంగా ఎదురుచూశానని తెలిపారు. దళిత సంఘం నాయకుడిగా దళిత ఎమ్మెల్యేకు జరిగిన అవమానంపై పోలీసులు చర్యలు తీసుకోకపోవడంతో ఫిర్యాదు చేస్తున్నట్లు పేర్కొన్నారు. 

అయితే వైఎస్ షర్మిపై ఫిర్యాదు అందిందని జోగిపేట పోలీసులు తెలిపారు.  అయితే ఆమెపై ఎలాంటి కేసు నమోదు చేయలేదని చెప్పారు. ఉన్నతాధికారుల ఆదేశాల కోసం వేచి చూస్తున్నట్లు తెలిపారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios