తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో మద్యం, డబ్బు అక్రమ రవాణాను అరికట్టడంతో పాటు శాంతిభద్రతల నిమిత్తం పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి విస్తృతంగా వాహనాల తనిఖీలు చేపట్టారు.

ఈ క్రమంలో వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు వద్ద పలువురు ప్రముఖుల వాహనాలను పోలీసులు తనిఖీ చేస్తున్నారు. తాజాగా పరకాల నియోజకవర్గంలోని పలు గ్రామాలకు ప్రచారం నిమిత్తం వెళ్తున్న భారత మాజీ కెప్టెన్ అజహారుద్దీన్ కారును పోలీసులు తనిఖీ చేశారు.

వాహనంలో ఎలాంటి అక్రమ తరలింపులు లేకపోవడంతో అజహార్‌ను పంపేశారు. మరోవైపు ఇదే మార్గంలో వెళ్తున్న ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు కారును కూడా పోలీసులు తనిఖీ చేశారు.