Asianet News TeluguAsianet News Telugu

ప్రోటోకాల్ వివాదం, మంత్రి చేతుల్లో మైక్ లాక్కొన్నందుకు... ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డిపై కేసు

మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై కేసు నమోదైంది. తనకు సమాచారం ఇవ్వకుండా రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం చేపట్టడాన్ని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తప్పుబట్టారు

police case filed against congress mla komatireddy rajgopal reddy ksp
Author
Hyderabad, First Published Jul 27, 2021, 6:19 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై కేసు నమోదైంది. మంత్రి జగదీశ్ రెడ్డి ప్రసంగాన్ని అడ్డుకున్నందుకు గాను కోమటిరెడ్డిపై కేసు నమోదు చేశారు పోలీసులు. తహసీల్దార్ గిరిధర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు చౌటుప్పల్ పోలీసులు. 

నిన్న యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ లో నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో గందరగోళం చోటు చేసుకొంది. రాష్ట్ర ప్రభుత్వం  ఇవాళ కొత్త రేషన్ కార్డులను పంపిణీని ప్రారంభించింది. అయితే  మునుగోడు నియోజకవర్గంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం చౌటుప్పల్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమం సందర్బంగా తనకు సమాచారం ఇవ్వకుండా రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం చేపట్టడాన్ని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తప్పుబట్టారు. 

ALso Read:మంత్రి జగదీష్ రెడ్డి చేతిలో మైక్‌ లాక్కొన్న కోమటిరెడ్డి: వాగ్వాదం, ఉద్రిక్తత

తనకు సమాచారం ఇవ్వకుండానే ఈ కార్యక్రమాన్ని ఎలా నిర్వహిస్తారని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మండిపడ్డారు. మంత్రి జగదీష్ రెడ్డి  ప్రసంగిస్తున్న సమయంలో ఆయన చేతిలోని మైక్ ను  ఎమ్మెల్యే లాక్కొన్నాడు. దీంతో ఈ కార్యక్రమంలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకొంది.దీంతో టీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య పరస్పర వాదోపవాదాలు చోటు చేసుకొన్నాయి.  తమ నేతలకు మద్దతుగా నినాదాలు చేశారు.ఇరువర్గాల మధ్య స్వల్ప తోపులాట చోటు చేసుకొంది.తన నియోజకవర్గంలో సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios