టాలీవుడ్ స్టార్ అక్కినేని నాగార్జున భార్య, నటి అక్కినేని అమల పేరు చెప్పి ఓ వ్యక్తి సామాన్య ప్రజల నుంచి డబ్బులు గుంజాడు. కాగా.. బాధితుల ఫిర్యాదుతో నిందుతుడు చేస్తున్న మోసాలు భయటకు వచ్చాయి.

అసలు సంగతేంటంటే....  హైదరాబాద్ బ్లూ క్రాస్ సంస్థ ఛైర్ పర్సన్ గా అక్కినేని అమల వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.  కాగా... అమలతో మాట్లాడిస్తానంటూ రాహుల్ శర్మ అనే వ్యక్తి సైబర్ నేరస్థుడు మోసాలకు పాల్పడ్డాడు. అతను చేస్తున్న మోసాలను అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ ఉద్యోగి ఎం.వీ. బుచ్చిరాజు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

యువతీ యువకులకు ఫోన్ చేసి ఫ్లవర్ బుకేలు, టీ విందు, వీడియో చిత్రీకరణ తదితర ఖర్చులకు డబ్బు కావాలంటూ అడుగుతున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. కొద్ది రోజుల క్రితం తనకు రాహుల్ ఇదే విధంగా ఫోన్ చేశాడని... తాను అతను చెప్పిన మాటలు వినగానే అయోమయానికి గురయ్యానని చెప్పారు.

AlsoRead చదివేది ఏడో తరగతి... చేస్తున్నది ఐటీ ఉద్యోగం...

రాహుల్ చెప్పింది విన్న తర్వాత... బ్లూక్రాస్ లాభాపేక్ష లేకుండా పనిచేసే సంస్థ కదా అనే అనుమానం కలిగింది. అంతేకాకుండా బ్లూ క్రాస్ సంస్థ తరపు నుంచి విరాళాలు కూడా సేకరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే చాలా మంది వద్ద నుంచి రాహుల్ డబ్బులు గుజ్జినట్లు పోలీసులు చెబుతున్నారు. పరారీలో ఉన్న అతని కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. కాగా... సెలబ్రెటీల పేర్లు చెప్పి డబ్బులు గుంజేవారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోందని పోలీసులు చెబుతున్నారు.