Asianet News TeluguAsianet News Telugu

క్వారంటైన్ పాటించకుండా బయటకు.. నలుగురిపై కేసు

ప్రభుత్వ ఆదేశాలను లెక్కచేయకుండా నలుగురు హోం క్వారంటైన్ చేయలేదు. వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలంలో చోటుచేసుకుంది.

police case against four people, who are not following home quarantine
Author
Hyderabad, First Published Mar 23, 2020, 7:52 AM IST

కరోనా మహమ్మారి రోజురోజుకీ విజృంభిస్తోంది. దీని బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నవారి సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆదివారం కేంద్ర ప్రభుత్వం జనతా కర్ఫ్యూ ప్రకటించింది. దేశ ప్రజలంతా ఆదివారం బయటకు రాకుండా జాగ్రత్త  చర్యలు తీసుకున్నారు. అయితే.. ప్రస్తుత పరిస్థితుల్లో ఒక్కరోజు క్వారంటైన్ లో ఉంటే కరోనా అదుపులోకి వచ్చేలా లేదు. దీంతో.. తెలంగాణలో ఈ నెల 31 వరకు లాక్ డౌన్ ప్రకటించారు.

అయితే.. ప్రభుత్వ ఆదేశాలను లెక్కచేయకుండా నలుగురు హోం క్వారంటైన్ చేయలేదు. వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలంలో చోటుచేసుకుంది.

Also Read ఆదివారం మరో ఆరు... తెలంగాణలో 27కి చేరిన కరోనా కేసులు...

పూర్తి వివరాల్లోకి వెళితే.. ఖతార్ నుంచి ఇటీవల ఇద్దరు దంపతులు మండలంలోని దాట్ల గ్రామంలో అత్తగారి ఇంటికి వచ్చారు. ఆ దంపతులు, అత్తమామలకు అధికారులు కరోనా అవగాహన కల్పించి, స్వీయ నిర్భందంలో ఉండాలని సూచించారు. అయితే.. వారు అధికారుల సూచనలను పట్టించుకోకపోవడం గమనార్హం.ఇంట్లో నుంచి బటయకు రావొద్దని చెప్పినా విచ్చలవిడిగా తిరిగారు. దీంతో.. పోలీసులు ఆ నలుగురిపై కేసులు నమోదు చేశారు.

ఇదిలా ఉండగా.. తెలంగాణలో ఈ నెల 31 వరకు లాక్ డౌన్ ప్రకటించారు. ఆదివారంతో కలిపి ఇప్పటి వరకు 27 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ మరింత  వ్యాప్తి  చెందకుండా ఉండేందుకు అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
    
 

Follow Us:
Download App:
  • android
  • ios