హైదరాబాద్ మైలార్‌దేవ్ పల్లిలో సీరియల్ కిల్లర్ ప్రవీణ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకు ఇతను ఆరు హత్యలకు పాల్పడ్డాడు. వరుస హత్యల నేపథ్యంలో రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ సాయంతో 12 గంటల్లోనే నిందితుడిని అరెస్ట్ చేశారు. 

హైదరాబాద్ మైలార్‌దేవ్ పల్లిలో సీరియల్ కిల్లర్ ప్రవీణ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. 8 నెలల క్రితం జైలు శిక్ష అనుభవించిన అతను విడుదలైన తర్వాతి నుంచి వరుస హత్యలకు పాల్పడుతున్నాడు. స్థానిక నేతాజీ నగర్, దుర్గానగర్, కాటేదాన్‌లలో పలువురిని ఇతను హతమార్చాడు. వరుస హత్యల నేపథ్యంలో రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ సాయంతో 12 గంటల్లోనే నిందితుడిని అరెస్ట్ చేశారు. మద్యం మత్తులోనే దుండగుడు వీరిని హతమార్చినట్లు నిందితుడు ప్రవీణ్ ఒప్పుకున్నాడు. ఇప్పటి వరకు ఇతను ఆరు హత్యలకు పాల్పడ్డాడు. సైకో కిల్లర్ వీరినే కాకుండా గతంలో మరెవరినైనా ఇలాగే హత్య చేశాడా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.