మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే నెపంతో విద్యార్ధి నేత మద్దిలేటిని పోలీసులు మంగళవారం నాడు అదుపులోకి తీసుకొన్నారు.
గద్వాల: మావోయిస్టులకు రిక్రూట్‌మెంట్ చేస్తున్నారనే నెపంతో మద్దిలేటిని గద్వాల పోలీసులు మంగళవారం నాడు అదుపులోకి తీసుకొన్నారు. మద్దిలేటితో పాటు కృష్ణ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
మావోయిస్టులతో సంబంధాలు కలిగి ఉన్నారని మద్దిలేటిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మద్దిలేటికి చెందిన రూమ్‌లో సోదాలు నిర్వహించిన సమయంలో మావోయిస్టులకు చెందిన కొంత సమాచారాన్ని స్వాధీనం చేసుకొన్నట్టుగా పోలీసులు చెబుతున్నారు.
వారం రోజులుగా మద్దిలేటి ఆచూకీ లేకుండాపోయింది.మంగళవారం నాడు గద్వాల పోలీసులు మద్దిలేటిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. మద్దిలేటితో పాటు కృష్ణను కూడ పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.
విద్యార్ధులను మావోయిస్టుల్లో చేర్పించేందుకు మద్దిలేటి ప్రయత్నాలు చేస్తున్నారని పోలీసులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై మద్దిలేటితో పాటు ఇంకా ఎవరెవరు ఉన్నారనే విషయమై పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు.
