తిరుమలగిరిలోని ఫుట్‌బాల్‌ గ్రౌండ్‌ సమీపంలో ఉంటున్న ఇక్బాల్‌బేగం ఇంటి వద్దకు వెళ్లి రెక్కీ నిర్వహించారు. ఈ నెల 1న దోపిడీ చేయాలని అనుకున్నారు. 

ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక.. అత్త ఇంట్లోనే చోరీకి పాల్పడ్డాడు ఆ ఇంటి అల్లుడు. చివరకు బాధితురాలు ఇచ్చిన ఓ చిన్న క్లూ ఆధారంగా కేసు దర్యాప్తు చేసిన పోలీసులు.. నిందితుడిని పట్టుకున్నారు. నిందితుడు అల్లుడే అని తెలుసుకున్న కుటుంబసభ్యులు విస్తుపోయారు.

పూర్తది వివరాల్లోకి వెళఇతే..వారాసిగూడలో నివాసముంటున్న ఆటోడ్రైవర్‌ సయ్యద్‌ జమీల్‌.. ఆదాయం సరిపోకపోవడంతో అప్పులు చేస్తున్నాడు. అప్పుల బాధ భరించలేక అత్త ఇంట్లో నగదు, బంగారం దోచుకునేందుకు నిర్ణయించుకున్నాడు. తన తమ్ముడు సయ్యద్‌ ముజీబ్‌కు విషయాన్ని వివరించాడు. సరేనన్న తమ్ముడు అన్నతో కలిసి పథకం వేశాడు. తన స్నేహితులు షేక్‌ అబ్దుల్‌ సలీమ్‌, మహ్మద్‌ ఇమ్రాన్‌, మహ్మద్‌ ఇస్మాయిల్‌, మహ్మద్‌ ఆద్నాన్‌, మహ్మద్‌ జమీర్‌, బీబీ బేగంలతో కలిసి దోపిడీ చేద్దామని ముజీబ్‌ చెప్పాడు. 

అనంతరం మొత్తం ఎనిమిది మంది పదిరోజుల క్రితం తిరుమలగిరిలోని జమీల్‌ బంధువు ఇంట్లో సమావేశమయ్యారు. ఇంట్లో పురుషులు లేనప్పుడు వెళ్లి కత్తులు, తల్వార్‌లతో బెదిరించి దోచుకోవాలని భావించారు. తిరుమలగిరిలోని ఫుట్‌బాల్‌ గ్రౌండ్‌ సమీపంలో ఉంటున్న ఇక్బాల్‌బేగం ఇంటి వద్దకు వెళ్లి రెక్కీ నిర్వహించారు. ఈ నెల 1న దోపిడీ చేయాలని అనుకున్నారు. 

ముజీబ్‌ తన కారు తీసుకురాగా... 1న ఎనిమిది మంది ఇక్బాల్‌ బేగం ఇంటికి చేరుకున్నారు. జమీల్‌ ఇంటికి దూరంగా ఉండగా... మిగిలిన వారు ఇంట్లోకి వెళ్లి షంషున్నీసా, ఇక్బాల్‌బేగం కాళ్లు చేతులు కట్టేసి, నోటికి పట్టీ వేసి సొత్తు దోచుకుని బయటకు వచ్చారు. గంట తర్వాత ఇక్బాల్‌ బేగం ఇంటికి వచ్చిన బంధువు వీరి కట్లు విప్పాడు. ఆమె స్పృహ తప్పి పడిపోవడంతో ఆసుపత్రికి తరలించారు.