Asianet News TeluguAsianet News Telugu

హైద్రాబాద్ లో ఏడుగురు నకిలీ బాబాల అరెస్ట్: రూ. 8 లక్షలు స్వాధీనం

అమాయక ప్రజల నమ్మకాన్ని ఆసరాగా చేసుకొని మోసాలకు పాల్పడుతున్న ఏడుగురు నకిలీ బాబాలను రాచకొండ పోలీసులు మంగళవారం నాడు అరెస్ట్ చేశారు. నిందితుల నుండి రూ. 8 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

  Police Arrested Fake Baba and his followers in Hyderabad
Author
hyderabad, First Published Jul 5, 2022, 11:25 AM IST

హైదరాబాద్: అమాయక ప్రజల నమ్మకాన్ని ఆసారాగా చేసుకొని మోసం చేస్తున్న ఏడుగురు Fake Baba లను Rachakonda పోలీసులు మంగళవారం నాడు అరెస్ట్ చేశారు. నిందితుల నుండి రూ. 8 లక్షలను స్వాధీనం చేసుకొన్నారు పోలీసులు. ప్రజల నమ్మకాలను ఆసరాగా చేసుకొని ఈ ముఠా డబ్బులు వసూలు చేస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు.

గతంలో కూడా తెలుగు రాష్ట్రాల్లో నకిలీ బాబాలు ప్రజలను మోసం చేసిన కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది మార్చి మాసంలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలోని ఘట్‌కేసర్ లో నకిలీ బాబా ఉదంతం వెలుగు చూసింది. సిరిసిల్ల జిల్లాకు చెందిన  సంజీవ్ అలియాస్ సంజయ్ , చందులు నకిలీ బాబాల అవతారం ఎత్తారు.  ఈ ఏడాది ఏప్రిల్ 11న ఘట్ కేసర్ మండలం ఎదులాబాద్ గ్రామానికి చెందిన మాచర్ల రాజు  వద్దకు వచ్చి బాబాలుగా పరిచయం చేసుకున్నారు.

రాజు ఇంట్లో దయ్యం ఉందని నమ్మించి పూజలు చేయాలని కోరారు. అయితే పూజల కోసం రాజు వద్ద నుండి విడతల వారీగా రూ. 35 వేలు తీసుకున్నారు.  అదే సమయంలో పూజ గదిలో రూ. 4 కోట్ల విలువైన బంగారం ఉందని నమ్మించారు.

అయితే ఈ బంగారం వెలికి తీసేందుకు రూ. 1.80 లక్షల విలువైన పూజా సామాగ్రి అవసరమని చెప్పారు. పూజా సామాగ్రి కోసం రూ. 1.50 లక్షలతో పాటు పూజల కోసం రూ.ఏడు లక్షలు చెల్లించాడు రాజు. పూజలు  చేసిన కొన్ని రోజుల తర్వాత  పూజ గదిలో చూడాలని రాజుకు చెప్పి వెళ్లిపోయారు. అయితే పూజ గదిని తెరిచి చూసిన తర్వాత బంగారం లభ్యం కాలేదు. ఈ విషయమై బాధితుడు రాజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.ఈ ఫిర్యాదు ఆదారంగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

గత ఏడాది ఆగష్టు మాసంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూడా నకిలీ బాబాను పోలీసులు అరెస్ట్ చేశారు. తనతో శారీరకంగా కలిస్తే తనలోని శక్తులు మీకు వస్తాయని మహిళలను నమ్మించిన నకిలీ బాబా తన లైంగిక వాంఛలు తీర్చుకొన్నాడు.  నకిలీ బాబా విశ్వచైతన్యను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుండి రూ. 26 లక్షల నగదును కూడా పోలీసులు సీజ్ చేశారు. నల్గొండ జిల్లాలోని పీఏపల్లి మండలం ఆజ్మాపురంలో  ఆశ్రమాన్ని ఏర్పాటు చేసిన విశ్వచైతన్య ప్రవచనాలు చెప్పడం ప్రారంభించాడు. తనకు మహిమలు ఉన్నాయని ప్రజలను నమ్మించాడు. విశ్వచైతన్య అమాయకులైన మహిళలను నమ్మించి లైంగిక కోరికలను తీర్చుకున్నాడు. 

also read:‘నిమ్మరసంతో సంతానం కలిగిస్తాం..’, ‘గుప్తనిధులు తీసి ధనవంతుల్ని చేస్తాం’... నకిలీ బాబాల అరెస్ట్, రిమాండ్..

మరో వైపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వివాహితపై నకిలీ బాబా అత్యాచారానికి పాల్పడిన ఘటన 2018 ఏప్రిల్ 23న చోటు చేసుకొంది. వివాహిత జబ్బును నయం చేస్తామని నమ్మించి వివాహితపై అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడు తన ఐదుగురు అనుచరులతో కలిసి వివాహితపై అత్యాచారానికి పాల్పడ్డాడు. వివాహితకు మత్తు మందిచ్చి అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయమై బాధితురాలు పోలీసులకు పిర్యాదు చేసింది. 

Follow Us:
Download App:
  • android
  • ios