అభం, శుభం తెలియని ఓ మైనర్ బాలికపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ సంఘటన మహబూబ్ నగర్ జిల్లాలో చోటుచేసుకుంది. కాగా.. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడం గమనార్హం.

బుధవారం ఆత్మకూర్‌లో అడిషనల్‌ ఎస్పీ షాకీర్‌హుస్సేన్, సీఐ సీతయ్య సంఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. మండలంలోని ఓ గ్రామానికి చెందిన కిరాణషాపు యజమాని చందు(22) సోమవారం రాత్రి 8:0 గంటల ప్రాంతంలో బాలిక షాపులో కొనుగోలు కోసం వచ్చింది. ఇదే అదునుగా భావించిన యువకుడు బాలికను బలవంతంగా షాపులోకి తీసుకెళ్లి షెట్టర్‌వేసి అత్యాచారానికి పాల్పడ్డాడు.

 విషయాన్ని బాలిక మంగళవారం మధ్యాహ్నం తల్లితండ్రులకు తెలిపింది. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు ఆత్మకూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పూర్తిస్థాయిలో విచారణ చేపట్టిన అనంతరం నిందితుడిని అరెస్ట్‌ చేసి 376, ఫోక్సోచట్టం, ఎస్సీఎస్టీ యాక్ట్‌ ప్రకారం కేసు నమోదు చేశారు.