మాయమాటలు చెప్పి ఆమెను తన ఇంటికి తీసుకెళ్లిన నిందితుడు మొక్క సత్యనారాయణ, అత్యాచారానికి పాల్పడ్డాడు. 

మనవరాలి వయసు ఉన్న ఓ చిన్నారిపై ఓ వృద్ధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఐదేళ్ల పసిది అన్న కనికరం కూడా లేకుండా పాడుపనికి పాల్పడ్డాడు. అభశుభం తెలియని ఆ పసిదానిపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఫలితంగా జైలుపాలయ్యాడు. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలంలో ఓ గ్రామంలో ఈ నెల 25న జరిగిన ఈ దారుణం, ఆలస్యంగా వెలుగుచూసింది. 

ఆరోజున బాధిత చిన్నారి తన ఇంటి సమీపంలో ఆడుకుంటోంది. మాయమాటలు చెప్పి ఆమెను తన ఇంటికి తీసుకెళ్లిన నిందితుడు మొక్క సత్యనారాయణ, అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక రాత్రంతా ఏడ్చి, మరుసటి రోజు తన తల్లిదండ్రులకు విషయాన్ని తెలిపింది. బాలిక తల్లిదండ్రులు మునగాల పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించిన పోలీసులు, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.