సొంత మేనత్త మొగుడే ఆ బాలికపట్ల కాల యుముడిగా మారాడు. తన కూతురు తోటిదే ఆ బాలిక కూడా అన్న ఇంగితం కూడా లేకుండా.. బాలికను చెరబట్టాడు. పలుమార్లు బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు.ఈ దారుణ సంఘటన హైదరాబాద్ నగరంలోని నిజాంపేటలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే...  తూర్పుగోదావరి జిల్లాకు చెందిన బావ, బావమరుదులు కొన్ని సంవత్సరాల క్రితం హైదరాబాద్ కి వలస వచ్చారు. ఇద్దరూ కుటుంబాలతో సహా ఇక్కడకు వచ్చి సెటిల్ అయ్యారు. ఇద్దరూ వేర్వేరు అపార్ట్ మెంట్ సముదాయాల్లో వాచ్ మెన్లు గా వ్యవహరిస్తున్నారు.

ఇద్దరూ ఒకే ప్రాంతంలో నివసిస్తున్నారు. ఇద్దరికీ చెరో ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు.  పిల్లంతా అటు ఇటుగా ఒకే వయసువాళ్లు కావడం గమనార్హం. వీరిలో ఇద్దరు స్థానికంగా ఉన్న ఓ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నారు.  కాగా... తన కూతురు వయసుదే అని మరచి.. బావమరిది కూతురిపై బావ కన్నేశాడు.

Also Read శాయంపేటలో కాల్పులు: రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి తిరుమల్ రెడ్డి అరెస్ట్...

ఎవరికీ తెలీకుండా బావమరిది( భార్య సోదరుడు) కూతురు(13)కి మాయమాటలు చెప్పి ఆమెను లోబరుచుకున్నాడు. పలుమార్లు బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దని చెబితే చంపేస్తానని బెదిరించాడు.

దీంతో బాలిక ఎవరికీ విషయం చెప్పకుండా తనలోనే దాచుకుంది. అయితే... కామాంధుడి నిర్వాకానికి బాలిక గర్భం దాల్చడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అప్పటికే బాలిక నాలుగు నెలల గర్భవతి అని డాక్టర్లు చెప్పడం విని ఆమె తల్లిదండ్రులు షాకయ్యారు. ఆ గర్భానికి కారణం ఎవరని తల్లిదండ్రులు నిలదీయడంతో... బాలిక నిజం చెప్పింది. దీంతో.. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.