Asianet News TeluguAsianet News Telugu

ట్రాప్ చేసి... హోటల్ గదిలో గడిపి... ఆ వీడియోలతో...

కూకట్‌పల్లి విజయానగర్‌ కాలనీలోని ఓయో లాడ్జిలో గడిపారు. అనంతరం మహేశ్వరి తన స్నేహితుడు సంతోష్‌తో కలిసి మణికంఠను బెదిరించి డబ్బులు వసూలు చేయాలని పథకం పన్నింది.

police arrest the couple who cheated man in hyderabad
Author
Hyderabad, First Published Dec 27, 2019, 9:12 AM IST

ఆ ఇద్దరు స్నేహితులు మామూలు వాళ్లు కాదు. ఆమె తన అందంతో ముందుగా ఎవరినో ఒకరిని ట్రాప్ చేస్తుంది. మాయమాటలు , కైపెక్కించే కబుర్లతో హోటల్ కి తీసుకువెళ్తుంది. అక్కడ ఇద్దరూ గడిపిన మొత్తాన్ని ఆమె తన స్నేహితుడి సహాయంతో వీడియో తీస్తుంది. ఆ వీడియోలను చూపించి బెదిరించి ఇద్దరూ కలిసి లక్షల్లో కాజేస్తారు. ఈ ఇద్దరినీ తాజాగా పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... కావేరి హిల్స్‌లో ఉంటున్న మణికంఠకు టెండర్‌  ఆన్‌లైన్‌ అప్లికేషన్లు పూర్తి చేసే క్రమంలో మహేశ్వరి అనే యువతితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం ఆధారంగా ఈ నెల 14న వీరిద్దరూ కూకట్‌పల్లి విజయానగర్‌ కాలనీలోని ఓయో లాడ్జిలో గడిపారు. అనంతరం మహేశ్వరి తన స్నేహితుడు సంతోష్‌తో కలిసి మణికంఠను బెదిరించి డబ్బులు వసూలు చేయాలని పథకం పన్నింది.

ఇందులో భాగంగా సంతోష్‌తో మణికంఠకు ఫోన్‌ చేయించి తాము  కూకట్‌పల్లి పోలీసులమని చెబుతూ లాడ్జిలో గడిపిన వీడియోలు తమ వద్ద ఉన్నాయని అతడిని బెదిరించి అతడి నుంచి రూ.4.49 లక్షలు వసూలు చేయడంతో పాటు ఐఫోన్‌ కూడా తీసుకున్నారు. మరో రూ. 1.5లక్షలు ఇవ్వాలని ఒత్తిడి చేయడంతో బాధితుడు ఈ నెల 22న మాదాపూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేపీహెచ్‌బీ పోలీసులకు బదిలీ చేశారు. 

కేపీహెచ్‌బీ పోలీసులు మణికంఠ ద్వారా నిందితులకు ఫోన్‌ చేయించి డబ్బులు తీసుకునేందుకు ఫోరంమాల్‌ వద్దకు రావాలని చెప్పారు. గురువారం ఉదయం మహేశ్వరి, సంతోష్‌ అక్కడికి రాగానే పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులను స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించగా   నేరం అంగీకరించారు. వారి నుంచి 4.09లక్షల నగదు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. నిందితులను పట్టుకోవటంలో చాకచక్యంగా వ్యవహరించిన పోలీస్‌ అధికారులకు ప్రోత్సాహకం అందజేయనున్నట్లు పోలీసులు చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios