తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన హైదరాబాద్ ఆమ్నేషియా పబ్ అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ కుమారుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఈ కేసులో అరెస్ట్‌ల సంఖ్య రెండుకు చేరింది. 

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన హైదరాబాద్ ఆమ్నేషియా పబ్ అత్యాచారం కేసుపై (amnesia pub rape case) తెలంగాణ ప్రభుత్వం (telangana govt) సీరియస్‌గా స్పందించింది. నిందితులు ఎంతటి వారైనా వదిలిపెట్టొద్దని.. తక్షణం కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ క్రమంలో బాలిక రేప్ కేసులో వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ (waqf board chairman) కుమారుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నగర శివారులోని ఓ ప్రాంతంలో అతనిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ కుమారుడితో పాటు మరో మైనర్ బాలుడు వున్నాడు. హోదాతో సంబంధం లేకుండా చర్యలు తీసుకోవాలని.. డీజీపీ, సీపీకి మంత్రి కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు. 

కాగా.. గత నెల 28వ తేదీన స్నేహితులతో కలిసి తాను అమ్నేషియా పబ్ కు వెళ్లినట్టుగా బాధితురాలు పోలీసులకు ఇచ్చిన స్టేట్ మెంట్ ఇచ్చిందని తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీ ప్రసారం చేసింది. Pub నుండి సాయంత్రం ఐదు గంటల సమయంలో తనను కొందరు బలవంతంగా Carలో తీసుకెళ్లారని బాధితురాలు ఆ స్టేట్ మెంట్ లో వివరించారు. అనంతరం రాత్రి ఏడుగు గంటల సమయంలో తనను పబ్ వద్ద వదిలివెళ్లారని ఆమె వివరించింది. కారులో తనపై అత్యాచారానికి పాల్పడినట్టుగా బాధితురాలు స్టేట్ మెంట్ ఇచ్చారని ఆ మీడియా సంస్థ తెలిపింది. అమ్నేషియా పబ్ లో తాము పార్టీ చేసుకున్నామని కూడా బాలిక వివరించింది.

పార్టీ నుండి కొందరు గుర్తు తెలియని యువకులు తనను బలవంతంగా కారులో తీసుకెళ్లారని బాధితురాలు ఆ statement లో పేర్కొన్నారు. కారులో అత్యాచారానికి పాల్పడిన తర్వాత తనను పబ్ వద్ద దింపి వెళ్లిపోయారని ఆమె ఆ స్టేట్ మెంట్ లో పేర్కొంది. తనపై అత్యాచారం జరిగిన విషయాన్ని తన తండ్రికి చెప్పినట్టుగా బాధితురాలు వివరించారు.తనకు మెడ వద్ద తీవ్ర గాయాలయ్యాయని బాధితురాలు తెలిపారు. తనపై బెంజీ కారులోనే అత్యాచారం జరిగినట్టుగా బాధితురాలు చెప్పారు. పబ్ వద్ద ఇన్నోవా కారులో తనను దింపేశారని బాలిక స్టేట్ మెంట్ ఇచ్చింది. 

ఈ కారులో బాలికతో పాటు ఐదుగురున్నారని బాలిక పోలీసులకు ఇచ్చిన స్టేట్ మెంట్ లో పేర్కొంది. ఈ కేసులో ప్రజా ప్రతినిధుల పిల్లలున్నారని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన స్టేట్ మెంట్ లో వివరించినట్టుగా ఎన్టీవీ న్యూస్ చానెల్ తెలిపింది. అయితే ప్రజా ప్రతినిధుల పిల్లలు మైనర్ బాలికపై అత్యాచారం కేసులో వారికి సంబంధం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.