తెలంగాణ ముఖ్యమంత్రి అధికారిక నివాసం ప్రగతి భవన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రగతి భవన్ ముట్టడికి పీడీఎస్‌యూ నాయకులు యత్నించారు. నిరుద్యోగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 

తెలంగాణ ముఖ్యమంత్రి అధికారిక నివాసం ప్రగతి భవన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రగతి భవన్ ముట్టడికి పీడీఎస్‌యూ నాయకులు యత్నించారు. నిరుద్యోగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. అయితే వారిని పోలీసులు అడ్డుకున్నారు. అయినప్పటికీ కొందరు విద్యార్థులు రోడ్డుపై పడుకుని నిరసన తెలిపారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. అయితే కొద్దిసేపటికే వారిని అరెస్ట్ చేసిన పోలీసులు.. అక్కడి నుంచి గోషామహల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.