ఎంఎల్ఎం స్కీం పేరిట ప్రజల నుంచి రూ.కోట్లు వసూలు చేసిన కేసులో ఇండస్ వివా పిరమిడ్ ఛైర్మన్‌ను (indusviva pyramid scheme) పోలీసులు అరెస్ట్ చేశారు. కొన్నాళ్ల క్రితం ఇండస్ వివాలపై కేసు నమోదవ్వగా.. ఈరోజు ఛైర్మన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

ఎంఎల్ఎం స్కీం పేరిట ప్రజల నుంచి రూ.కోట్లు వసూలు చేసిన కేసులో ఇండస్ వివా పిరమిడ్ ఛైర్మన్‌ను (indusviva pyramid scheme) పోలీసులు అరెస్ట్ చేశారు. కొన్నాళ్ల క్రితం ఇండస్ వివాలపై కేసు నమోదవ్వగా.. ఈరోజు ఛైర్మన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సైబర్ క్రైమ్ పోలీసుల కేసు ఆధారంగా ఈడీ దర్యాప్తు జరుపుతోంది. ఇండస్ ఛైర్మన్ అభిలాష్‌తో (abhilash) పాటు సీఏ అంజార్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. 10 లక్షల మంది కస్టమర్ల నుంచి రూ.15 వందల కోట్లు వసూలు చేసింది ఈ ముఠా. 

బెంగళూరుకు చెందిన అభిలాష్ థామస్, ప్రేమ్ కుమార్ సహా మరికొంత మంది ఓ ముఠాగా ఏర్పడ్డారు. వీరు ఇండస్ వివా హెల్త్ సైన్సెస్ అనే పేరుతో ఓ కంపెనీని ఏర్పాటు చేశారు. బెంగ‌ళూరు కేంద్రంగా మ‌ల్టీలెవెల్ మార్కెటింగ్ ప్రారంభించారు. ఓ స్కీమ్ ను ప్ర‌వేశ‌పెట్టారు. రూ.12,500 రూపాయలతో ఇందులో మెంబ‌ర్ షిప్ తీసుకుంటే వాటి విలువగల ఆ సంస్థకు సంబంధించిన వివిధ ప్రొడక్టులను అందిస్తుంటారు.

అలా సభ్యత్వం తీసుకున్న వారు ఇతరులను కూడా చేర్చుకుంటూ పోతే వారికి గోల్డ్, ప్లాటినం, సిల్వర్ అంటూ కేటగిరీలను క్రియేట్ చేసి వారిని ఆ జాబితాల్లోకి ఎక్కిస్తారు. ఎవరు ఎంత మందిని చేర్చితే అంత క‌మిష‌న్‌ అంటూ న‌మ్మిస్తారు. అప్పుడ‌ప్పుడూ ఫైవ్ స్టార్ హోటల్స్‌లో భారీ ఈవెంట్లు ఏర్పాటు చేసి.. ఫలానా వాళ్లు ఈ సంస్థలో ఇదే స్కీమ్ ద్వారా విజయం సాధించి లగ్జరీ కారు, ఫ్లాట్ ను కొన్నారంటూ, విదేశీ టూర్లలో షికార్లు చేస్తున్నారంటూ వాళ్లతో చెప్పిస్తారు.

ఇలా న‌మ్మించి దేశవ్యాప్తంగా 10 లక్షల మందిని సభ్యత్వం తీసుకునేలా ప్రోత్స‌హించారు. వారి నుంచి రూ. 1,500 కోట్ల రూపాయలను వసూలు చేశారు. అయితే ఈ ఏడాది మార్చిలో ఇండస్ వివా సంస్థపై గచ్చీబౌలీ పోలీసులకు ఓ ఫిర్యాదు అందింది. దీంతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఈ ముఠాను అరెస్ట్ చేశారు.