తెలంగాణ విద్యుత్ శాఖ జూనియర్ లైన్‌మెన్ ప్రశ్నాపత్రం లీక్‌ కేసు విచారణలో పురోగతి చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేశారు.

తెలంగాణ విద్యుత్ శాఖ జూనియర్ లైన్‌మెన్ ప్రశ్నాపత్రం లీక్‌ కేసు విచారణలో పురోగతి చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేశారు. ప్రశ్నాపత్రం లీక్‌కు సంబంధించి విద్యుత్ శాఖ ఉద్యోగులే కీలక సూత్రధారులుగా పోలీసులు తేల్చారు. ఇక, విద్యుత్ శాఖ జూనియర్ లైన్‌మెన్ పరీక్ష జూలై 17న జరిగిన సంగతి తెలిసిందే. మేడ్చల్​ జిల్లా ఘట్‌కేసర్‌లోని ఓ పరీక్షా కేంద్రంలోకి శివప్రసాద్ అనే ఎలక్ట్రిషియన్ శివప్రసాద్ అనే ఎలక్ట్రిషియన్.. లైన్‌మెన్ పరీక్ష రాశాడు. పరీక్షకు సెల్‌ఫోన్‌తో హాజరయ్యాడు. శివప్రసాద్‌కు ఏడీఈ పిరోజ్ ఖాన్, అసిస్టెంట్ డివిజన్ ఇంజనీర్ సైదులు, సబ్ ఇంజనీర్ షేక్ షాజాన్‌లు సమాధానాలు చెరవేశారు. 

అయితే శివప్రసాద్ సెల్‌ఫోన్‌ తీసుకొచ్చినట్టుగా గుర్తించిన నిర్వాహకులు ఫిర్యాదుతో చేయడంతో ఘట్‌కేసర్ పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో అభ్యర్థి శివప్రసాద్ వెనుక విద్యుత్ శాఖ ఉద్యోగుల ప్రమేయం ఉన్నట్టుగా తేలింది. పరీక్షకు ముందే పలువురు అభ్యర్థులతో నిందితులు.. ఒక్కో ఉద్యోగానికి రూ. 5 లక్షల చొప్పున వారితో ఒప్పందం చేసుకున్నారు. వారి నుంచి అడ్వాన్స్‌గా రూ. లక్ష వసూలు చేశారు. మైక్రోఫోన్ సాయంతో వీరు సమాధానాలను పరీక్ష రాసిన పలువురు అభ్యర్థులకు చెరవేశారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఐదుగురు నిందితులు ఉన్నారు. 

మరోవైపు జూనియర్ లైన్‌మెన్ పరీక్ష ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయని కొద్ది రోజుల క్రితం కడ్తాల్‌కు చెందిన కె.లోక్యా నాయక్ అంబర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.