కొమరంభీమ్ జిల్లాలో అటవీశాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. చింతల మానేపల్లి మండలం లంబాడీ హట్టీలో పోలీసులు, అటవీశాఖ అధికారులు మంగళవారం ఉదయం సంయుక్తంగా కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో భారీగా కలప, గుడుంబా స్వాధీనం చేసుకున్నారు.

ఈ సందర్భంగా చెట్లను నరికివేయడం, అటవీ భూముల ఆక్రమణలు, గుడుంబా తయారీని తక్షణం నిలిపివేయాలని అధికారులు గ్రామస్థులను హెచ్చరించారు. అలాగే అటవీ నేరాలకు పాల్పడవద్దని, గుడుంబాతో అనారోగ్యాలు తెచ్చుకోవద్దని కౌన్సెలింగ్‌ నిర్వహించారు.

హద్దు మీరితే పీడీ కేసులు పెడతామని చెప్పారు. ప్రభుత్వ పథకాలను వినియోగించుకుని ఉపాధి పొందాలని, నేరాలకు పాల్పడవద్దని కోరిన అధికారులు..నేరాలు చేయమని గ్రామస్థులతో ప్రమాణం చేయించారు. 

"