కార్పొరేటర్ కొడుకు మీద పోక్సో కేసు.. ప్రేమించాలంటూ బాలికకు వేధింపులు, చంపేస్తానంటూ బెదిరింపులు..

ప్రేమించాలంటూ మైనర్ బాలికను వేధింపులకు గురిచేయడమే కాకుండా.. చంపేస్తానని బెదిరించిన కేసులో కార్పొరేటర్ కొడుకు మీద పోక్సో కేసు నమోదయ్యింది. 

Pokso case against corporators son in hyderabad

హైదరాబాద్ : ప్రేమించాలంటూ బాలికను వేధిస్తున్న corporator తనయుడిపై మీర్ పేట పోలీసులు pocso, నిర్భయ కేసులు నమోదు చేశారు. సీఐ మహేందర్రెడ్డి కథనం ప్రకారం..  జిల్లెలగూడ మల్రెడ్డి రంగారెడ్డి కాలనీకి చెందిన కార్పొరేటర్ కుమారుడు, మీర్పేట బీజేవైఎం అధ్యక్షుడు బజ్జనమోని ముకేష్ యాదవ్ స్థానికంగా నివసించే ఓ బాలిక (15)ను ప్రేమించాలంటూ కొంతకాలంగా వేధిస్తున్నాడు. తరచూ మెసేజ్లు పంపుతూ, ఫోన్ చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. 

ఈ క్రమంలో ఆదివారం బాలిక సమీపంలోని కిరాణా షాప్ కు వెళ్తుండగా ముఖేష్ యాదవ్ వెంబడించి ప్రేమించకపోతే చంపేస్తానని బెదిరించాడు. దీంతో భయాందోళనకు గురైన బాలిక విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపింది. బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ముఖేష్ యాదవ్ పై pocso, నిర్భయ చట్టం కింద కేసులు నమోదు చేసి సోమవారం రిమాండ్కు తరలించారు. ముఖేష్ పై మరో కేసు కూడా నమోదు అయిందని.. దాని మీద కూడా విచారణ జరుగుతోందని సిఐ తెలిపారు. 

ఇదిలా ఉండగా, నిరుడు జూన్ లో హైదరాబాద్ లో ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. రోజురోజుకూ మైనర్ల మీద మైనర్లు చేస్తున్న అకృత్యాలు మితిమీరిపోతున్నాయి. మితిమీరిన సెల్ ఫోన్ వాడకం, సోషల్ మీడియా, అడ్డూఅదుపూ లేని పోర్న్.. అడ్డకునేవారు లేకపోవడం.. చిన్నవయసులోనే అబ్బాయిల్ని తప్పుదోవ పట్టిస్తున్నాయి. అలాంటిదే ఓ దారుణ ఘటన హైదరాబాద్ లోని హిమాయత్ నగర్ లో జరిగింది. 

ఫ్రెండే కదా నమ్మి రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసినందుకు మైనర్ బాలికను వేధింపులకు గురిచేస్తున్నాడో మైనర్ బాలుడు. సైదాబాద్ కు చెందిన ఇంటర్మీడియట్ బాలిక ఇన్ స్ట్రాగామ్ అకౌంట్ కు తన క్లాస్ మేట్ ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టాడు. ప్రెండే కదా అని యాక్సెప్ట్ చేయగా కొద్ది రోజులుగా ఇద్దరూ చాటింగ్ చేసుకున్నారు. ఈ క్రమంలో బాలిక తన ఫ్రెండ్ కు కొన్ని ఫొటోస్ ను పంపింది.

ఆ ఫొటోలతో అతగాడు బాలిక పేరుతో ఫేక్ ఐడీని క్రియేట్ చేశాడు. తనకు న్యూడ్ గా వీడియో కాల్ చేయాలని, లేనిపక్షంలో నీ ఫొటోలన్నింటినీ ఎడిట్ చేసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చైసి వైరల్ చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాడు. దీంతో విసిగెత్తిన బాలిక అతడిమీద శుక్రవారం సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios