Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబు, సోనియాల వద్దే కేసీఆర్ శిక్షణ...అందువల్లే ఈ పరిస్థితి: మోదీ

తెలంగాణ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ బారతీయ జనతా పార్టీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఇవాళ  ప్రధాని నరేంద్ర మోదీ నిజామాబాద్ తో పాటు పాలమూరులో జరిగిన బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణలో టీఆర్ఎస్ పాలనతో పాటు గత కాంగ్రెస్ పాలనపై  విమర్శల వర్షం కురింపించారు. బిజెపి అభ్యర్థులనుు గెలిపించాలని మోదీ తెలంగాణ ప్రజలకు సూచించారు. 
 

pm narendra modi election campaign meeting at palamuru
Author
Mahabubnagar, First Published Nov 27, 2018, 4:31 PM IST

తెలంగాణ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ బారతీయ జనతా పార్టీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఇవాళ  ప్రధాని నరేంద్ర మోదీ నిజామాబాద్ తో పాటు పాలమూరులో జరిగిన బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణలో టీఆర్ఎస్ పాలనతో పాటు గత కాంగ్రెస్ పాలనపై  విమర్శల వర్షం కురింపించారు. బిజెపి అభ్యర్థులనుు గెలిపించాలని మోదీ తెలంగాణ ప్రజలకు సూచించారు. 

పాలమూరు సభలో ప్రధాని మాట్లాడుతూ...గతంలో పాలు ప్రవహించి సస్యశ్యామలంగా వున్న ఈ జిల్లాలో ఇప్పుడు పలాయన(వలసలు) జిల్లాగా ఎందుకు మారిందని ప్రశ్నించారు. తెలంగాణ వలసలు, వెనుకబాటుపై గత 5 సంవత్సరాలు పాలించిన పార్టీని అంతకంటే ముందు పాలించిన వారిని ప్రశ్నించాలని ప్రధాని సూచించారు.  కృష్ణా, తుంగభద్ర నదులు ప్రవహించే నేలలో ఇంత కరువా అని అంటూ ప్రధాని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

ప్రస్తుత తెలంగాణ రాష్ట్రం అనేక మంది అమరవీరుల బలిదానాలు, ప్రజల ఉద్యమాల వల్ల వచ్చిందన్నారు. కానీ ఒకే కుటుంబం వల్ల  తెలంగాణ వచ్చిందని  అసత్య ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. గత నాలుగు తరాలుగా దేశంలో,  ఐదు సంవత్సరాలుగా తెలంగాణలో కుటుంబ పాలన నడుస్తోందని ప్రధాని ఆరోపించారు.

అంతేకాకుండా తెలంగాణ వస్తే తమకు న్యాయం జరుగడంతో పాటు రాష్ట్రం అభివృద్ది చెందుతుందని  భావించి ఇక్కడి ప్రజలు పోరాడారని అన్నారు. కానీ అవేవీ నెరవేర్చకుండా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం కుల కుల రాజకీయాలు చేస్తోందన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల మధ్య పోటీ జరగడంలేదని...అదంతా  డబ్యుడబ్యుఎఫ్ లో లాగా నకిలీ  కుస్తీ అని ఎద్దేవా చేశారు.
 
కాంగ్రెస్, టీఆర్ఎస్ రెండు పార్టీలకు చాలా పోలీకలున్నాయిని మోదీ వివరించారు. రెండిటిది కుటుంబ పాలన, కుల రాజకీయాలు, ఓటు బ్యాకు రాజకీయాలలో అన్నదమ్ముల, హిందూ ముస్లిం, గ్రామాలకు నగరాలకు, కులానికి కులానికి  మధ్య ఘర్షనలు పెట్టే స్వభావేమనని అన్నారు. ఈ ఓటు బ్యాంకు రాజకీయాల కోసమై మైనారిటీలకు రిజర్వేషన్లు ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారన్నారు.

ఇక తెలంగాణలోని కొందరు నాయకులు ఆంధ్రా, తెలంగాణలో ముఖ్యమంత్రులంతా తమప పాదాల వద్ద ఉన్నవారేనని అన్నట్లు తెలిసిందని మోదీ గుర్తుచేశారు. స్వాభిమానం కోసమే తెలంగాణ  పోరాటం జరిగిందని అలాంటిది మరోకరి కాళ్లవద్ద ఉండి పనిచేసే ముఖ్యమంత్రి మనకు అవసరమా అని ప్రశ్నించారు. అలా ఎవరి పాదాల వద్ద కూర్చోని సీఎం ఎన్నుకుందామన్నారు.

టీఆర్ఎస్ గత ఐదు సంవత్సరాల పాలనలో మీ ఆకాంక్షలు నెరవేరాయా అంటూ సభకు వచ్చిన వారిని మోదీ ప్రశ్నించారు. ఈ పాలకులు తెలంగాణతో పాటు ప్రజల భవిష్యత్ ను కూడా సర్వనాశనం చేశారని మండినపడ్డారు.

 అమరుల ప్రాణత్యాగం, ప్రజల పోరాటం తర్వాత ఏర్పడిన తెలంగాణకు మొదటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు, డిల్లీ  మేడమ్(సోనియా) వద్ద  శిక్షణ తీసుకున్న కేసీఆర్ బాధ్యతలు చేపట్టారని మోదీ ఎద్దేవా చేశారు.  గురువుల మాదిరిగానే కేసీఆర్ పాలన సాగిందని... అందువల్లే తెలంగాణ నాశనం అయ్యిందన్నారు. తెలంగాణ ఉజ్వల భవిష్యత్ కోసమే ప్రస్తుతం ఎన్నికలు వచ్చాయని...మళ్ళీ  ఐదేళ్లు వారికి పాలన అప్పగిస్తే  ఇక రాష్ట్రం శాశ్వత  అందకారంలోకి వెళుతుందన్నారు.

తెలంగాణ అమరవీరుల ఆకాంక్ష కోసమైనా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవకుండా పోరాడాలన్నారు. తెలంగాణను మోసం చేసిన పార్టీలను ఇంటికి పంపించాలని సూచించారు. 

 కేసీఆర్ మంత్రిగా పనిచేసినప్పటి యూపిఎ ప్రభుత్వం ఫైనాన్స్ కమీషన్ ద్వారా తీసుకువచ్చిన నిధుల కంటే బిజెపి కేంద్ర ప్రభుత్వం ఈ తెలుగు రాష్ట్రాలకు ఎక్కువ నిధులిచ్చిందని మోదీ తెలిపారు. తెలంగాణలో 3 వేల కోట్ల రూపాయలతో 20 పైగా ప్రాజెక్టుల చేపడుతున్నట్లు తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలో లేకపోయినప్పటికి నిస్పక్షపాతంగా హైదరాబాద్ మెట్రో నిర్మాణం కోసం నిధులిచ్చామన్నారు. ఇలా సబ్ కా సాత్ సబ్ కా వికాస్ నినాదంతో ముందుకు వెళుతున్నామని మోదీ వివరించారు. 

వల్లభాయ్ పటేల్ లేకుంటే హైదరాబాద్ కు రావాలంటే పాకిస్థాన్ వీసా తీసుకుని రావాల్సి ఉండేదని మోదీ అన్నారు. ఆయన ఆశయాలకు అనుగునంగానే 
రైతుల సంక్షేమం కోసం పనిచేస్తున్నామని....2022 నాటికి రైతుల ఆదాయం రెండింతలు చేయడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. గత నాలుగేళ్ళలో ఒక కోటికి పైగా  ఇళ్లను కట్టించామన్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ లు ఒకే కాయిన్ కు రెండు వైపుల వంటి పార్టీలన్నారు. కాబట్టి డిసెంబర్ 7 న జరిగే ఎన్నికల్లో బిజెపికి ఓటెయ్యాలని ప్రధాని ప్రజలకు  సూచించారు.

సంబంధిత వార్తలు

70 ఏళ్లు ఏం చేశారంటే.. మోడీ తండ్రి పేరేంటి అంటున్నారు : ప్రధాని
 

Follow Us:
Download App:
  • android
  • ios