ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన ఖరారు.. పరేడ్ గ్రౌండ్‌లో బహిరంగ సభ..!
తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఖరారు అయింది. ఫిబ్రవరి 13న ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటించనున్నారు.

తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఖరారు అయింది. ఫిబ్రవరి 13న ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటించనున్నారు. తన పర్యటనలో భాగంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో అభివృద్ది పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే పరేడ్ గ్రౌండ్‌లో జరిగే బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొననున్నట్టుగా తెలుస్తోంది. వాస్తవానికి ప్రధాని మోదీ జనవరి 19నే తెలంగాణ పర్యటనకు రావాల్సి ఉంది. అయితే అనివార్య కారణాల వల్ల ప్రధాని మోదీ పర్యటన తాత్కాలికంగా వాయిదా పడింది. తన పర్యటన వాయిదా పడినప్పటికీ.. సికింద్రాబాద్-విశాఖపట్నం వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ముందుగా అనుకున్న సమయానికి కంటే నాలుగు రోజులుగా ముందుగానే ప్రధాని మోదీ ప్రారంభించారు. అయితే ఆయన వర్చువల్‌గా కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇక, జనవరి 19న మోదీ తెలంగాణ పర్యటన తాత్కాలిక వాయిదా పడటంతో.. నిలిచిన పోయిన అభివృద్ది ప్రాజెక్టుల శంకుస్థాపన, ప్రారంభోత్సవాల కార్యక్రమాలను ఫిబ్రవరి 13న పూర్తిచేయనున్నారు. అనంతరం ప్రధాని మోదీ సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొనున్నారు.