8న తెలంగాణకు ప్రధాని మోడీ.. ఆయన పర్యటన షెడ్యూల్ ఇదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 8వ తేదీన హైదరాబాద్‌కు రానున్నారు. సికింద్రాబాద్ టు తిరుపతికి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌ను ప్రారంభిస్తారు. 8వ తేదీన ఉదయం 11.30 గంటలకు హైదరాబాద్‌కు వచ్చి మధ్యాహ్నం 1.30 గంటలకు ఆయన తిరిగి వెళ్లిపోనున్నారు. వెళ్లడానికి ముందు పరేడ్ గ్రౌండ్‌లో బహిరంగ సభలో మాట్లాడనున్నారు.
 

pm modi to arrive to telangana on 8th of this month at 11.30 am, will leave after two hours kms

హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 8వ తేదీన తెలంగాణకు వస్తున్నారు. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌ను ఆయన ప్రారంభించి వెళ్లిపోతారు. సికింద్రబాద్ నుంచి తిరుపతిని కలిపే ఈ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌ సేవలను ఆయన ప్రారంభిస్తారు. అలాగే, పలు ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తారు. 

ప్రధాని మోడీ తెలంగాణ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 8వ తేదీన ఉదయం 11.30 గంటలకు ఆయన హైదరాబాద్‌కు విచ్చేస్తారు. 11.30 గంటలకు ఆయన బేగంపేట విమానాశ్రయంలో దిగుతారు. అనంతరం, అక్కడి నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వస్తారు. 11.45 గంటల కల్లా ఆయన సికింద్రబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. అనంతరం, 11.45 నుంచి 12 గంటలకు సికింద్రాబాద్ - తిరుపతి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌ను ఆయన ప్రారంభిస్తారు.

Also Read: బీజేపీలో చేరిన కన్నడ యాక్టర్ కిచ్చా సుదీప్.. హర్ట్ అయిన ప్రకాశ్ రాజ్.. ఆయన ఏమన్నారంటే?

అనంతరం,మధ్యాహ్నం 12.15 గంటలకు అక్కడి నుంచి పరేడ్ గ్రౌండ్‌‌కు చేరుతారు. అక్కడే 1.20 గంటల వరకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల, పలు ప్రాజెక్టులను జాతికి అంకితం ఇస్తారు. మధ్యాహ్నం 1.30 గంటలకు ఆయన తిరిగి వెళ్లిపోతారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios