జయశంకర్ జిల్లా కలెక్టర్ ఆకునూరి మురళి హితబోధ

ప్రజలందరూ గొడ్డుకూర తినాలని జయశంకర్ జిల్లా కలెక్టర్ ఆకునూరి మురళి హితబోధ చేశారు. వందల వేల సంవత్సరాలు నుంచి మనం అవే తింటున్నాం అని స్పష్టం చేశారు.

ముఖ్యంగా మన జిల్లాలలో అడవి పందుల బెడద ఎక్కువగా ఉంది కాబట్టి ఆ అడవి పందులను మనమే తినాల్సిన అవసరం ఉందనే చారిత్రక సత్యాన్ని జిల్లావాసులకు తెలియజేశారు.

అక్కడితో ఆగకుండా అమెరికాలో అడవి పంది మాంసమే ఎక్కువ ఖరీదైనదని తేల్చిచెప్పారు. కానీ, ఇక్కడ మాలధారణ, దేవుడి పేరుతో మనం అలాంటి ఖరీదైన మాంసాన్ని తినడం

మానేస్తున్నాం అని ఆందోళన వ్యక్తం చేశారు. బ్రాహ్మణ భావజాలంతో మన తిండి మనం తినడం మరిచిపోయామని ఫీలయ్యారు.

జిల్లాలో ఉన్న ఆశా వర్కర్లు కూడా అడవి పంది మాసం తినేలా ప్రజల్లో చైతన్యం తీసుకరావాలని ఆదేశించారు. తాను ఇప్పటి వరకు ఆ మాంసాన్ని రుచి చూడలేదని ఎవరైనా తెస్తే తప్పకుండా తింటానని తన మనసులో మాట బయటపెట్టారు.