తెలంగాణ‌ రాష్ట్ర ప్రభుత్వంపై, టీఆర్ఎస్ నాయకులపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన ఆరోపణలను రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మ‌న్ బోయినపల్లి వినోద్ కుమార్ తోసిపుచ్చారు. మ‌త‌ప‌ర‌మైన విభ‌జ‌న రాజ‌కీయాల‌కు బీజేపీ నాయ‌కులు స్వ‌స్తి పల‌కాల‌ని సూచించారు. 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై, టీ.ఆర్.ఎస్. నాయకులపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన ఆరోపణలను రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మ‌న్ బోయినపల్లి వినోద్ కుమార్ తోసిపుచ్చారు. బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ మత పరమైన వ్యాఖ్యలు చేశార‌నీ, అందుకే బీజేపీ అధిష్టానం రాజా సింగ్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేసిందని పేర్కొన్నారు.

బీజేపీ అధిష్టానం ప్రకారం.. రాష్ట్ర బీజేపీ నాయకులు మత పరమైన వ్యాఖ్యలు చేస్తూ.. దేశ ప్రజాస్వామిక విలువలకు తిలోదకాలు ఇచ్చి ప్రవర్తిస్తున్నారని స్పష్టం అవుతోందని అన్నారు. మత సామరస్యానికి ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని, ప్రజాస్వామ్యంలో మత విద్వేషాలకు తావు ఉండొద్దని పేర్కొన్నారు. హైదరాబాద్ లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించ వద్దని విజ్ఞ‌ప్తి చేశారు. మత పరమైన విభజన రాజకీయాలకు బీజేపీ రాష్ట్ర నాయకులు స్వస్తి పలకాలని సూచించారు. 

మత పరమైన వ్యాఖ్యలు చేస్తూ ప్రభుత్వం నుంచి, ఇతర పార్టీల నుంచి స్పందన కోరుకుంటున్న బీజేపీ రాష్ట్ర నాయకులు. ఇదేమీ సంస్కారమ‌ని ప్ర‌శ్నించారు. పాదయాత్రలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్నది ఇదేన‌ని అన్నారు.

అభివృద్ధి ప‌థంలో ముందుకు వెళ్తున్న తెలంగాణ‌కు బీజేపీ నాయకులు మచ్చ తేవద్దని అన్నారు. సీఎం కేసీఆర్ పై బీజేపీ నాయకులు అవినీతి ఆరోపణలు చేయడం కొత్తేమీ కాద‌నీ, బీజేపీ నాయకుల తీరు ఆక్షేపనీయం. మత పరంగా విభజన రాజకీయాలను బీజేపీ నాయకులు మానుకోవాలని వినోద్ కుమార్ హిత‌వు ప‌లికారు.