తమిళనాడు నుండి మధ్యప్రదేశ్‌కి లారీలో 55 మంది కూలీలు: చిత్తూరులో పోలీసుల అరెస్ట్
లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించి లారీలో 55 మంది కూలీలు తమిళనాడు నుండి మధ్యప్రదేశ్ కు వెళ్తుండగా చిత్తూరు పోలీసులు ఆదివారంనాడు అరెస్ట్ చేశారు. లారీని సీజ్ చేశారు.
చిత్తూరు: లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించి లారీలో 55 మంది కూలీలు తమిళనాడు నుండి మధ్యప్రదేశ్ కు వెళ్తుండగా చిత్తూరు పోలీసులు ఆదివారంనాడు అరెస్ట్ చేశారు. లారీని సీజ్ చేశారు.
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది మే 3వ తేదీవరకు లాక్ డౌన్ పొడిగించింది. దీంతో ఆయా ప్రాంతాల్లోనే వలసకూలీలు ఉన్నారు.
కొందరు తమ స్వంత గ్రామాలకు కాలినడకన కూడ వెళ్లారు. మరికొందరు తాము ఉంటున్న ప్రాంతంలోనే నివాసం ఉన్నారు. ఉపాధి లేని కారణంగా వలస కూలీలు తమ స్వంత గ్రామాలకు వెళ్లేందుకు అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు.
also read:బోటులో చెన్నై నుండి శ్రీకాకుళానికి 12 మంది మత్స్యకారులు: క్వారంటైన్‌కి తరలింపు
తమిళనాడు రాష్ట్రంలో ఉపాధి కోసం మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాలకు చెందిన వలసకూలీలు కొంత కాలం క్రితం వలస వెళ్లారు. లాక్‌డౌన్ నేపథ్యంలో వలస కూలీలు ఉపాధి కోల్పోయారు.
దీంతో మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 55 మంది కూలీలు తమ స్వరాష్ట్రానికి వెళ్లాలని నిర్ణయం తీసుకొన్నారు. వాహనాలు నడవడం లేదు. ఈ తరుణంలో నిత్యావసర సరుకులను తరలించే వాహనంలో తమ స్వంత గ్రామాలకు వెళ్లాలని భావించారు.
నిత్యావసర సరుకులను తరలించే లారీలో 55 మంది కూలీలు తమిళనాడు నుండి మధ్యప్రదేశ్ రాష్ట్రానికి బయలుదేరారు. చిత్తూరు జిల్లా కలకడ చెక్‌పోస్టు వద్ద పోలీసులు ఈ లారీని తనిఖీ చేశారు. ఆ సమయంలో లారీలో 55 మంది కూలీలు ప్రయాణిస్తున్న విషయాన్ని పోలీసులు గుర్తించారు. లారీలో ప్రయాణం చేస్తున్న కూలీలను వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. వారిని స్థానికంగా ఉన్న ఆదర్శ పాఠశాలకు తరలించారు. లారీ డ్రైవర్లు నారాయణ్ సింగ్ యాదవ్, ఉమేష్ లపై కేసులు నమోదు చేశారు.