Asianet News TeluguAsianet News Telugu

పీఎఫ్ఐ కదలికలు: ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో ఎన్ఐఏ సోదాలు

పీఎఫ్ఐ కదలికలపై  ఎన్ఐఏ  నిఘానె పెట్టింది.  తెలంగాణ రాష్ట్రంలోని  కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు చేస్తుంది. 

PFI Case: NIA Conducts Searches in  Adilabad, Karimnagar of Telangana lns
Author
First Published Aug 10, 2023, 9:36 AM IST

హైదరాబాద్:రాష్ట్రంలోని కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో గురువారంనాడు  ఉదయం ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తున్నారు. పీఎఫ్ఐ  కదలికల నేపథ్యంలో ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తుంది.కరీంనగర్ హుస్సేన్‌పురలో ఎన్ఐఏ సోదాలు  చేస్తుంది.  హుస్సేన్ పురలో పీఎఫ్ఐ కదలికలపై అనుమానాలతో అనుమానంతో ఎన్ఐఏ సోదాలు  చేస్తుంది. ఆదిలాబాద్ జిల్లాలో కూడ ఎన్ఐఏ అధికారులు  చేస్తున్నారు.గతంలో కూడ పీఎఫ్ఐ కదలికలపై  అనుమానాలతో  ఎన్ఐఏ అధికారులు  రెండు తెలుగు రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించారు.

2022  సెప్టెంబర్ 18న  ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని  40 చోట్ల  ఎన్ఐఏ అధికారులు  సోదాలు నిర్వహించారు. రెండు రాష్ట్రాల్లో  నలుగురిని  అరెస్ట్  చేశారు.తెలంగాణలోని నిజామాబాద్ లో  పీఎఫ్ఐ కదలికలను  స్థానిక పోలీసులు తొలుత గుర్తించారు.  నిజామాబాద్ లో వ్యాయామ శిక్షణ పేరుతో  నిర్వహిస్తున్న ట్రైనర్ ఇంటిపై  పోలీసులు  సోదాలు  నిర్వహించిన  సమయంలో పీఎఫ్ఐ  కార్యకలాపాలు వెలుగు చూశాయి.  దీంతో 2022  జూలై  4న  నలుగురిని స్థానిక పోలీసులు అరెస్ట్  చేశారు.  

షేక్  సహదుల్లా,  మహమ్మద్ ఇమ్రాన్, మహమ్మద్ అబ్దుల్ మోబీన్,  అబ్దుల్ ఖదీర్ లను  పోలీసులు అరెస్ట్  చేశారు.   దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కూడ పీఎఫ్ఐ కార్యకలాపాలు వెలుగు చూశాయి.  దీంతో  పలు రాష్ట్రాల్లో   ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. పలు చోట్ల పలువురిని అరెస్ట్  చేశారు.ఇదిలా ఉంటే  తెలంగాణలో పీఎఫ్ఐ  కేసును  స్థానిక పోలీసులు ఎన్ఐఏకి అప్పగించారు.   ఈ కేసును ఎన్ఐఏ విచారిస్తుంది.  

నిజామాబాద్ లో మహమ్మద్  పీఎఫ్ఐ వైపు యువతను ఆకర్షించేందుకు ప్రయత్నించినట్టుగా  దర్యాప్తు సంస్థలు  గుర్తించాయి. ఆత్మరక్షణ పేరుతో  ట్రైనింగ్ నిర్వహిస్తూ  యువతను  ఉగ్రవాదం వైపు ఆకర్షించినట్టుగా  దర్యాప్తు సంస్థలు ఆరోపించాయి.ఈ మేరకు  నిందితులపై  పోలీసులు  కేసు నమోదు చేశారు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios