Asianet News TeluguAsianet News Telugu

అశాంతిని రగిల్చేలా పీఎఫ్ఐ కార్యకలాపాలు.. నిజామాబాద్ లో వెలుగులోకి...నలుగురు అరెస్ట్...

విద్వేశాలను రగిల్చేలా యువతకు ట్రైనింగ్ ఇస్తున్న పీఎఫ్ఐ సంస్థకు చెందిన నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో 24 మంది కోసం వెతుకుతున్నారు. 

PFI activities in nizamabad, 4 arrest
Author
Hyderabad, First Published Aug 5, 2022, 6:56 AM IST

హైదరాబాద్ : ఓ వర్గానికి చెందిన పేద కుటుంబాల్లోని చురుకైన యువకుల్ని ఎంపిక చేసుకోవడం… ఇతర వర్గాలపై విద్వేష భావజాలాన్ని నూరిపోయడం… రాళ్లు విసరడంతో సిద్ధహస్తులని చేయడం.. మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ ఇచ్చి వారిని మానవ మిస్సైళ్లుగా మార్చడం… అవసరమైనప్పుడు సంఘ విద్రోహ చర్యల దిశగా వారిని ఉసిగొల్పి దేశాన్ని అస్థిరపడడం.. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ముసుగులో కొందరు ఈ తరహా దుశ్చర్యలకు పాల్పడుతున్నారని నిజామాబాద్ పోలీసుల దర్యాప్తులో వెల్లడయింది. ఈ కేసులో ఇప్పటికే నిజామాబాద్ వాసులు అబ్దుల్ ఖాదర్, మహమ్మద్ ఇమ్రాన్,  షేక్  షాదుల్లా, మహమ్మద్ అబ్దుల్ మోబిన్ ను  పోలీసులు  అరెస్టు  చేశారు. 

పరారీలో ఉన్న మరో 24 మందిని నిందితులుగా చేర్చారు. అరెస్ట్ అయిన నిందితుల రిమాండ్ డైరీలో పోలీసులు ఎన్నో ఆశ్చర్యకరమైన అంశాలను పొందుపరిచారు. డైరీలోని వివరాల  ప్రకారం… ‘ మొదట  స్వచ్ఛంద, ధార్మిక సంస్థ కార్యకలాపాల ముసుగులో విరాళాలు సేకరిస్తూ.. ఆ సొమ్మును సేవా కార్యక్రమాల ద్వారా పంచిపెడుతూ ఓ వర్గం ప్రజల మన్ననలు పొందడంపైనే పీఎఫ్ఐ దృష్టి సారించింది. ముఖ్యంగా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాల యువత సులభంగా తమ గాలానికి చిక్కుతారనే భావన ఆ గ్రూపు లో ఉంది. ఆ గ్రూపు తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల సమావేశాలు నిర్వహించింది. బైంసా, బోధన్, జగన్ జగిత్యాల్, హైదరాబాద్, కర్నూల్, నంద్యాల,  నెల్లూరు లతోపాటు  దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ ఈ సమావేశాలు జరిగాయి.  వైరి వర్గం ప్రజల్లోకి చొచ్చుకెళ్లేందుకు  వీలుగా  గ్రూపు తరఫున  15 అనుబంధ విభాగాల కూడా పని చేస్తున్నాయి.

రేపు ఢిల్లీకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. బీజేపీ అగ్రనేతలతో భేటీ అయ్యే ఛాన్స్

రూ. ఆరు లక్షలతో   ట్రైనింగ్ రూమ్…
గ్రూపు కార్యకలాపాల్లో కీలకమైన మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ ఇచ్చే బాధ్యతను నిందితుల్లో ఒకరైన మహ్మద్ అబ్దుల్ ఖాదర్ తీసుకున్నాడు. జగిత్యాల్ జగిత్యాలకు చెందిన కొంత కాలంగా నిజామాబాద్ ఆటో నగర్ లో ఉంటున్నాడు. కుంభ శిక్షకుడిగా ఉన్న అతని ఇంటి ఫస్ట్ ఫ్లోర్ లో ప్రత్యేక గదిని నిర్మించేందుకు రూ. ఆరు లక్షలు పీఎఫ్ఐ సమకూర్చింది. ఆర్నెల్లుగా అదే గదిలో అతను రెండు వందల మంది గ్రూపు కార్యకర్తలకు శిక్షణ ఇచ్చాడు. గ్రూపు కార్యకలాపాల విస్తరణ కోసం సేకరించిన విరాళాలు సొమ్ము కేసుల్లో చిక్కున్న కార్యకర్తలకు న్యాయ సహాయం చేసేందుకు, ఓ జాతీయ పార్టీ, దాని అనుబంధ సంస్థలకు వ్యతిరేకంగా కార్యకలాపాలు నిర్వహించేందుకు  వినియోగిస్తున్నారు. తమ గ్రూపు గురించి ప్రచారం చేసేందుకు వీరంతా విద్యా సంస్థలు, ప్రార్ధన ఆలయాలను అనువైన ప్రాంతాలుగా ఎంచుకుంటున్నారు. క్రమం తప్పకుండా  డివిజన్,  ప్రాంతీయ, రాష్ట్ర స్థాయి సమావేశాలు నిర్వహిస్తూ   రిక్రూట్మెంట్లు చేసుకుంటున్నారు’ అని డైరీలో పేర్కొన్నారు.

తలకు తగిలేలా రాళ్లు రువ్వడంలో శిక్షణ…
పరారీలో ఉన్న నిందితుడు ఇలియాస్ ఇంట్లో స్వాధీనం చేసుకున్న హ్యాండ్ బుక్ లో కీలక సమాచారం లభ్యం అయినట్లు పోలీసులు రిమాండ్కు డైరీలో నమోదు చేశారు. ‘కార్యకర్తలకు మార్షల్ ఆర్ట్స్ తో పాటు రాళ్లు రువ్వడం లోను శిక్షణ ఇస్తున్నారు. ఇతర మతాల శాంతియుత ర్యాలీల సందర్భంగా విధ్వంసం సృష్టించాలి అనేది వీరి కుట్ర.  ర్యాలీ లో ఉన్నవారి తలకు తగిలేలా రాళ్లను విసరడం ద్వారా  ప్రాణనష్టం ఎక్కువగా ఉండాలనేది పన్నాగం. ఇలాంటి దుశ్చర్యలతో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా అనేది కుట్రలో భాగమని విశ్లేషించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios