నారాయణ, చైతన్య కళాశాలపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. నిబంధనలకు విరుద్ధంగా కళాశాలలు నడుస్తున్నాయంటూ పిటిషనర్‌ పేర్కొన్నారు.

నారాయణ, చైతన్యకు సంబంధించి 68 కాలేజీలతోపాటు మిగతా కార్పోరేట్ కళాశాలను మూసివేయాలని గతంలో హైకోర్టు ఆదేశించిన విషయాన్ని పిటిషనర్ గుర్తుచేశారు.

దీనిపై స్పందించిన న్యాయస్థానం ఎన్ని కళాశాలలను మూసివేశారో వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నుంచి సమాచారం తీసుకుని ఇవ్వాలని హైకోర్టు సూచించింది.

కాలేజీలు తెరవడానికి అనుమతివ్వాలని కార్పోరేట్ కళాశాలల తరపున న్యాయవాది న్యాయస్థానాన్ని కోరారు. గతంలో ఇచ్చిన ఆర్డర్‌పై స్టే విధించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్టే ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. అనంతరం తదుపరి విచారణను ఈ నెల 31కి వాయిదా వేసింది.