బీఆర్ఎస్ ఎమ్మెల్యే గొంగిడి సునీతపై హైకోర్టులో పిటిషన్..
ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఎన్నికల సమయంలో గొంగిడి సునీత ఆస్తుల వివరాలు తప్పుగా చూపారని మహేష్ అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు.

ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఎన్నికల సమయంలో గొంగిడి సునీత ఆస్తుల వివరాలు తప్పుగా చూపారని ఆలేరు గొల్లగూడెం గ్రామానికి చెందిన మహేష్ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే మహేష్ పూర్తి వివరాలతో కూడిన అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను హైకోర్టు నాలుగు వారాలకు వాయిదా వేసింది.