పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే విజయరమణరావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
పెద్దపల్లి: పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే విజయరమణరావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఆదివారం నాడు ఆయన పెద్దపల్లిలో మీడియాతో మాట్లాడారు. పెద్దపల్లి నియోజకవర్గంలో ఒక్క ఎకరం పొలం ఎండినా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి, టీఆర్ఎస్ నేతలకు గాజులు తొడుగుతానని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
పక్క జిల్లాలకు నీళ్లు దోచుకుపోతుంటే ఎమ్మెల్యే ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఎమ్మెల్యే చేతకానితనం వల్లే నీళ్లు పక్క జిల్లాలకు పోతున్నాయని ఆయన ఆరోపించారు. ఈ విషయమై ప్రశ్నిస్తే ఎదురుదాడి చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.టీఆర్ఎస్ నేతలు జిల్లా ప్రజల ప్రయోజనాలను వదిలేసి ఇతర జిల్లాలకు నీళ్లు వెళ్లిపోతున్నా పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు.
2009 లో పెద్దపల్లి నుండి ఇండిపెండెంట్ గా పోటీ చేసి విజయరమణరావు విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన టీడీపీలో చేరారు. మహకూటమి పొత్తులో ఈ స్థానంలో టీడీపీకి దక్కకపోవడంతో ఆయన స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసి ఓడిపోయాడు.
