హైదరాబాద్: ప్రముఖ వ్యాపారవేత్త చిగురుపాటి జయరామ్ హత్య కేసులో ప్రధాన నిందితుడిపై పీడీ యాక్ట్ నమోదు చేశారు బజారాహిల్స్ పోలీసులు. చిగురుపాటి జయరామ్ హత్య కేసులో కీలక నిందితుడుగా ఉన్న రాకేష్ రెడ్డిపై శుక్రవారం పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. 

ఏడాది దాకా జైలు నుంచి విడుదలయ్యే అవకాశం లేకుండా పీడీ యాక్ట్ పెట్టడం జరిగింది. ప్రస్తుతం రాకష్ రెడ్డి చంచల్ గూడ జైలులో ఉన్నాడు. ఇకపోతే చిగురుపాటి జయరామ్ హత్య కేసులో నిందితురాలు అంటూ ఆరోపణలు ఎదుర్కొన్న ఆయన మేనకోడలు శిఖా చౌదరికి క్లీన్ చిట్ ఇచ్చిన విషయం తెలిసిందే.