Asianet News TeluguAsianet News Telugu

కేసిఆర్ ఫ్యామిలీ మీద ఉత్తమ్ కొత్త సెటైర్

  • నిన్నటి వరకు నాలుగు.. ఇప్పుడు ఇంకోగాయన రెడీ
  • చేవెళ్ళ బస్సుయాత్ర ప్రారంభ సభలో ఉత్తమ్ పంచ్
Pcc chief uttam new punch on kcr family

తెలంగాణ సిఎం కేసిఆర్ కుటుంబం మీద ప్రతిపక్ష పార్టీలు పదే పదే విమర్శలకు దిగడం మనకు తెలిసిందే. కొందరు నాయకులైతే ఘాటుగా విమర్శలకు దిగిన సందర్భాలున్నాయి. అయితే తాజాగా పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చేవెళ్ల వేదికగా కేసిఆర్ కుటుంబం మీద సెటైర్ వేశారు. ఆ సెటైర్ ఏదంటే??

‘‘అధికారంలోకి రాకముందు టిఆర్ఎస్ అధినేత కేసిఆర్ ఇంటికో ఉద్యోగం ఇస్తానన్నాడు. కానీ.. ఆయన ఇంట్లోనే నాలుగు ఉద్యోగాలిచ్చుకున్నాడు.’’ ఈ డైలాగ్ గడిచిన మూడున్నరేళ్లుగా ప్రతిపక్షాలు వదులుతూనే ఉన్నాయి. నిజానికి ఇంటికో ఉద్యోగం అనే మాట తాము ఎప్పుడూ అనలేదని, అన్నట్లు రుజువు చేస్తే దేనికైనా రెడీ అని సిఎం కేసిఆర్ అసెంబ్లీ సాక్షిగా సవాల్ చేశారు. దానికి ప్రతిపక్షాలు ఎక్కడా జవాబు చెప్పలేదు. అయితే తెలంగాణ వచ్చిన తొలి ఏడాదిలోనే ఒక్క దెబ్బకే లక్ష ఉద్యోగాలిస్తాం.. లక్ష కుటుంబాలు తెలంగాణ రాష్ట్రంలో ఒక్క దెబ్బకే సెటిల్ అయిపోతాయి అని మాత్రం కేసిఆర్ ప్రకటించారు. ఆ ప్రకటన వీడియోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అంతేకాదు తెలంగాణ రాగానే దళితుడే తొలి సిఎం అని కూడా అన్నారు. ఈ రెండు హామీలైతే ఇచ్చారు కానీ.. ఇంటికో ఉద్యోగం హామీ ఇచ్చినట్లు ఎవరూ నిరూపించలేకపోయారు.

సరే ప్రతిపక్షాలు మాత్రం ఆ విమర్శను కంటిన్యూ చేస్తున్నాయి. తాజాగా చేవెళ్లలో బస్సు యాత్ర ప్రారంభ సభలో పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మరోసారి ఇదే విమర్శను చేశారు. అయితే దీనికి కొద్దిగా కొత్తదనం యాడ్ చేశారు. అదేమంటే.. ఇంటికో ఉద్యోగం ఇస్తానన్న కేసిఆర్ తన ఇంట్లోనే నాలుగు ఉద్యోగాలిచ్చుకున్నారు అని విమర్శించారు. ఇంటికో ఉద్యోగం కాదు కదా? ఊరికో ఉద్యోగం కూడా ఇవ్వలేదని ఆరోపించారు. ఇక ఐదో ఉద్యోగానికి ఇంకోగాయన రెడీ అవుతున్నాడు అని పంచ్ విసిరారు. (రాజ్యసభ రేస్ లో కేసిఆర్ అత్యంత సన్నిహితుడు, టిన్యూస్ సంతోష్ ఉన్నట్లు వార్తలొస్తున్నాయి కదా?)

మొత్తానికి కాంగ్రెస్ పార్టీ బస్సు యాత్ర సందర్భంగా కేసిఆర్ ఫ్యామిలీపైనే విమర్శలు ఎక్కుపెట్టడం రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ అయింది.

Follow Us:
Download App:
  • android
  • ios