Asianet News TeluguAsianet News Telugu

కేసీఆర్ కు ఉత్తమ్ బహిరంగ లేఖ

మంత్రి హరీష్ రావు సంధించిన 12 ప్రశ్నల లేఖకు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. హరీష్ ప్రశ్నలపై సమాధానం ఇస్తూ టీఆర్ఎస్ చీఫ్ ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని మంత్రి హరీష్ రావు తనకు రాసిన లేఖలో తేల్చేశారని లేఖలో పేర్కొన్నారు. 

pcc chief uttam kumarreddy  writes a letter to cm kcr
Author
Hyderabad, First Published Oct 10, 2018, 6:45 PM IST

హైదరాబాద్: మంత్రి హరీష్ రావు సంధించిన 12 ప్రశ్నల లేఖకు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. హరీష్ ప్రశ్నలపై సమాధానం ఇస్తూ టీఆర్ఎస్ చీఫ్ ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని మంత్రి హరీష్ రావు తనకు రాసిన లేఖలో తేల్చేశారని లేఖలో పేర్కొన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ ఓటమిని హరీష్ రావు ముందుగా అంగీకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. 

టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఫామ్ హౌజ్ కు పరిమితమయ్యే సమయం వచ్చేసిందని ఉత్తమ్ తెలిపారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ రాబోతుందన్నారు. రాష్ట్ర సంపదను దోచుకుని మూఢ నమ్మకాలతో పాలించారని ఉత్తమ్ మండిపడ్డారు. ఎన్నికలంటే భయపడుతున్న కేసీఆర్ కు మహాకూటమి పొత్తులపై ఆందోళన కలుగుతోందని విమర్శించారు. 

మరోవైపు హరీష్ రావు లేఖపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ స్పందించారు. మహాకూటమిని విమర్శించే ముందు ఎన్నికల హామీలను విస్మరించిన మీమామను నిలదియ్యాలని సూచించారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసిన మహాకూటమి విజయాన్ని ఆపలేరన్నారు. సీట్ల సర్దుబాటు అంశం సామరస్యంగా చేసుకుంటామని రమణ తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios