Asianet News TeluguAsianet News Telugu

కేసీఆర్ కుటుంబాన్ని తెలంగాణ నుంచి తరిమికొట్టాలి: ఉత్తమ్

 తెలంగాణ ఆపధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ పై పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నిప్పులు చెరిగారు. కేసీఆర్ స్థాయి మరచి, విజ్ఞత మరచి మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిలో అగ్రస్థానంలో చూపామంటున్న కేసీఆర్ మాటలు అసత్యాలని కొట్టిపారేశారు. నాలుగున్నరేళ్లలో లిక్కర్ సేల్స్ లో తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉందని రైతుల ఆత్మహత్యలో ముందంజలో ఉందని స్పష్టం చేశారు. 

pcc chief uttam fires on kcr
Author
hyderabad, First Published Sep 6, 2018, 4:53 PM IST

ఢిల్లీ: తెలంగాణ ఆపధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ పై పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నిప్పులు చెరిగారు. కేసీఆర్ స్థాయి మరచి, విజ్ఞత మరచి మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిలో అగ్రస్థానంలో చూపామంటున్న కేసీఆర్ మాటలు అసత్యాలని కొట్టిపారేశారు. నాలుగున్నరేళ్లలో లిక్కర్ సేల్స్ లో తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉందని రైతుల ఆత్మహత్యలో ముందంజలో ఉందని స్పష్టం చేశారు. 

నాలుగున్నరేళ్లపాటు తెలంగాణ ప్రజలను దగా చేసిన కేసీఆర్ అద్భుత ప్రగతి సాధించినట్లు చెప్పడం సిగ్గు చేటన్నారు. కేసీఆర్ అన్ పాపులర్ అవుతాడనే భయంతోనే ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారని ఆరోపించారు. సార్వత్రిక ఎన్నికల్లో అయితే ఓడిపోతారని భయంతోనే సెప్టెంబర్ లోనే ముందస్తుకు వెళ్తున్నట్లు తెలిపారు.  
 
మరోవైపు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియాగాంధీ కుటుంబంపై కేసీఆర్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం కోసం కాళ్లు పట్టుకున్న కేసీఆర్ ఇప్పుడు కళ్లు నెత్తికెక్కి పొగరుతో అహంకారంతో రాహుల్ గాంధీ ఫ్యామిలీపై లుచ్చామాటలు మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. రాహుల్ గాంధీ ఫ్యామిలీని విమర్శించే అర్హత కేసీఆర్ కు లేదన్నారు. కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో విలన్ గా చిత్రీకరించే ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నారని ప్రజలు నమ్మెుద్దంటూ సూచించారు. 

కేసీఆర్ మరియు అతని కుటుంబం నాలుగున్నరేళ్లపాటు తెలంగాణ రాష్ట్రాన్ని బందిపోటు దొంగళ్లా దోచుకుతిన్నారని మండిపడ్డారు. ఇరిగేషన్ ప్రాజెక్టులలో కమిషన్ తీసుకుంటున్నారని...ప్రతి పనికి 6శాతం కమిషన్ కేసీఆర్ కుటుంబం తీసుకుంటుందని ఆరోపించారు. 

ముందస్తు ఎన్నికలు కేసీఆర్ కుటుంబం మరియు తెలంగాణ ప్రజల పోరాటం అనే నినాదంతో జరుగనున్నట్లు తెలిపారు. నలుగురికి నాలుగున్నర కోట్ల మందికి మధ్యే పోటీ అన్నారు.   కేసీఆర్ కు బుద్ది చెప్పాల్సిన సమయం వచ్చిందని పీసీసీ చీఫ్ ఉత్తమ్ స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చామంటున్న కేసీఆర్ దళితుడిని సీఎం చేస్తానన్న హామీ ఏమైందని...దళితులకు మూడెకరాలు భూమి ఎక్కడ ఇచ్చారని ప్రశ్నించారు.

ఇంటికో ఉద్యోగం, డబుల్ బెడ్ రూం ఇళ్లు, ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఇలా ఏ ఒక్క హామీ అయినా అమలు చేశారా అని ప్రశ్నించారు. ఇంటింటికి కుళాయి కనెక్షన్ ఇస్తానని లేకపోతే ఎన్నికలకు రానని ప్రగల్భాలు పలికిన కేసీఆర్ ఎక్కడ కుళాయికనెక్షన్లు ఇచ్చారో స్పష్టం చెయ్యాలని డిమాండ్ చేశారు. 

 టీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ కు ఘోరికట్టే సమయం ఆసన్నమైందన్నారు. అహంకారంతో అవినీతితో తెలంగాణను దోచుకుతింటున్నారని మండిపడ్డారు. కేసీఆర్ కు పోయేకాలం వచ్చిందని అందువల్లే ముందస్తు ఎన్నికలకు పోతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబాన్ని ప్రజలు బొంద పెడతారన్నారు. కేసీఆర్ కుటుంబాన్ని చిత్తుచిత్తుగా ఓడించి రాష్ట్రం నుంచే తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios