గవర్నర్ కూడా అధికార పార్టీతోపాటుగా బురద చల్లితే లా అని ప్రశ్నించారు పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి. కామారెడ్డి జిల్లాలో ఇసుక ట్రాక్టర్ కింద పడి చనిపోయిన విఆర్ఎ సాయిలు కుటుంబసభ్యులు గాంధీభవన్ లో ఉత్తమ్ ను కలిశారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడారు.

మొన్న నెరేళ్ల ఘటనలో అధికారులు వికృతంగా ప్రవర్తించారు.  నిన్న ఇసుక ట్రాక్టర్ కిందపడి చనిపోయిన సాయిలు మృతి పై గవర్నర్ తో సహా అధికార పార్టీ నేతలు బురదజల్లుతున్నారు. రాష్ట్రంలో మంత్రులు కుమ్మక్కయ్యారంటే...పరిస్థితులు ఎలా ఉన్నాయో చూడొచ్చు.

సాయిలు మరణం పై ప్రభుత్వం పొలీసులు గవర్నర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వీరందరూ ఇలా కుమ్మక్కు కావడం సమాజానికి ప్రమాదకరం. సాయిలు VRA అన్నది ముమ్మాటికీ వాస్తవం. ఈ విషయాన్ని నమస్తే తెలంగాణ పత్రికలోనే రాశారు. ఇప్పుడు పోలీసులతో నిజాన్ని కపిపుచ్చుతున్నారు. ఉత్తమ్ ఇంకా ఏం మాట్లాడారో వీడియోలో చూడొచ్చు.