హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయట. ఇప్పటికే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చెయ్యడం లేదని, అయితే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తామని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. 

అయితే ఈ ఎన్నికల్లో జనసేన మద్దతు ఎవరికి ఇస్తుందన్న విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వకుండా దాటవేత ధోరణి ప్రదర్శిస్తున్నారు. ఎంత దాటవేసినా అభిమానులు, రాజకీయ పార్టీ నేతలు మాత్రం మద్దతుపై పవన్ ను గుచ్చిగుచ్చి అడుగుతున్నారట. దీంతో అందరి అభిప్రాయాన్ని గౌరవిస్తూ పవన్ తెలంగాణ ఎన్నికల్లో తన మద్దతు ప్రకటించేందుకు రెడీ అయ్యారు. 

తెలంగాణ ముందస్తు ఎన్నికల నేపథ్యంలో మిత్రులు, జనసైనికులు, ప్రజలతో పాటు పోటీ చేస్తున్న అభ్యర్థులు కూడా పార్టీ అభిప్రాయాన్ని తెలియజేయమని కోరుతున్నారు. జనసేన పార్టీ అభిప్రాయాన్ని 5వ తారీఖున తెలియపరుస్తాము అంటూ పవన్ ట్వీట్ చేశారు. 

డిసెంబర్ 5న పవన్ అభిప్రాయం ఏమై ఉంటుంది ఏ పార్టీకి మద్దతు ప్రకటిస్తారు..ప్రకటిస్తారా లేదా అన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.