తెలంగాణ నుంచే పవన్ రాజకీయ యాత్ర షురూ

తెలంగాణ నుంచే పవన్ రాజకీయ యాత్ర షురూ

తెలంగాణ, ఆంధ్రా అన్న తేడా లేకుండా లక్షల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన కలిగిన ఫిల్మ్ స్టార్ గా పవన్ కళ్యాణ్ నిలిచారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత పవన్ కు సీమాంధ్రలో ఫాలోయింగ్ అంతే స్థాయిలో ఉన్నది. తెలంగాణనూ యూత్ లో పవన్ కు భారీగానే ఫాలోయింగ్ ఉంది. అయితే పవన్ జనసేన పార్టీ స్థాపించారు. ఆ పార్టీ తరుపున గత ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఈసారి పోటీ చేస్తారన్న ప్రచారం సాగుతోంది. ఈ పరిస్థితుల్లో తెలంగాణలో పవన్ కు రాజకీయంగా వర్కవుట్ కాదు.. సీమాంధ్రలోనే గట్టి ప్రభావం చూపుతారని ప్రచారం ఉన్న తరుణంలో షాకింగ్ డిసిషన్ తీసుకున్నారు పవన్ కళ్యాణ్. ఆ వివరాలేంటో కింద చదవండి.

త్వరలో తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయాన్ని దర్శించుకుంటానని కొద్దిసేపటికిందట పవన్ కళ్యాణ్ ప్రకటించారు. తమ కుటుంబ ఇలవేల్పు కొండగట్టు ఆంజనేయ స్వామి అని పవన్ పేర్కొన్నారు. అందుకే తన రాజకీయ యాత్రను కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం నుంచే ప్రారంభిస్తానని పవన్ ప్రకటించారు. సర్వమత ప్రార్థనల అనంతరం ప్రజల ఆశిష్సులతో రాజకీయయాత్ర చేపడతానని వివరించారు.

2009లో ఎన్నికల్లో ప్రచారం చేస్తున్న సందర్భంలో పెను ప్రమాదం నుంచి బయటపడ్డది కొండగట్టు ప్రాంతంలోనే అని పవన్ పేర్కొన్నారు. కొండగట్టుకు ఎప్పుడు వెళ్లేది త్వరలోనే వెల్లడిస్తానని పవన్ ఒక పత్రికా ప్రకటనలో వెల్లడించారు. ఈ యాత్ర ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజల సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తానని పవన్ వెల్లడించారు. ప్రజా సమస్యలు అధ్యయనం చేసి అవగాహన చేసుకునేందుకు మీముందుకు వస్తున్నానని ప్రకటించారు. కొండగట్టు అంజన్న సమక్షంలోనే తన రాజకీయ భవిష్యత్తు ప్రణాళికను ప్రకటిస్తానని పవన్ స్పష్టం చేశారు.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos