Asianet News TeluguAsianet News Telugu

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పాతూరి సుధాకర్ రెడ్డి...నామినేషన్ దాఖలు

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరోసారి పోటీకి శాసన మండలి చీఫ్ విప్ పాతూరి సుధాకర్ రెడ్డి సిద్దమయ్యారు. మెదక్ -నిజామాబాద్ -ఆదిలాబాద్ -కరీంనగర్ శాసనమండలి స్థానానికి ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఆయన శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తున్న కరీంనగర్  కలెక్టర్ సర్పరాజ్ అహ్మద్ కు నామినేషన్ పత్రాలను సమర్పించారు. 

paturi sudhakar reddy filed a nomination
Author
Karimnagar, First Published Mar 1, 2019, 9:05 PM IST

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరోసారి పోటీకి శాసన మండలి చీఫ్ విప్ పాతూరి సుధాకర్ రెడ్డి సిద్దమయ్యారు. మెదక్ -నిజామాబాద్ -ఆదిలాబాద్ -కరీంనగర్ శాసనమండలి స్థానానికి ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఆయన శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తున్న కరీంనగర్  కలెక్టర్ సర్పరాజ్ అహ్మద్ కు నామినేషన్ పత్రాలను సమర్పించారు. 

paturi sudhakar reddy filed a nomination

ఈ నాలుగు జిల్లాలకు చెందిన ఉపాధ్యాయుల మద్దతుతో ఆయన పోటీకి సిద్దమయ్యారు. దాదాపు 26 ఉపాధ్యాయ సంఘాట మద్దతు తనకుందని ఈ సందర్భంగా సుధాకర్ రెడ్డి తెలిపారు. నాలుగు జిల్లలకు చెందిన ఉపాధ్యాయులంతా మొదటి ప్రాధాన్యత ఓటు తనకే వేసి గెలిపించి మరోసారి శాసన మండలికి పంపించాలని కోరారు. 

తెలంగాణ పట్టభద్రులు, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఎలక్షన్ కమీషన్ నోటిఫికేషన్ విడుదలచేసిన విషయం తెలిసిందే. మార్చి 5వ తేదీ వరకు నామినేషన్లు వేయడానికి అభ్యర్థులకు గడువునిచ్చింది. అనంతరం మార్చి 6న నామినేషన్ల పరిశీలించి మార్చి8 న విత్ డ్రా కు చేసుకునేవారికి అవకాశమిచ్చారు. మార్చి 22న ఎన్నికలు నిర్వహించి మార్చి 26న ఫలితాలు విడుదల చేయనున్నట్లు ఎలక్షన్ కమీషన్ ప్రకటించింది. 
 
Follow Us:
Download App:
  • android
  • ios