తెలంగాణ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. రోజురోజుకు రాష్ట్రంలో ప్రతిపక్ష కాంగ్రెస్ కు ఆదరణ పెరుగుతోంది. దీంతో కొంతమంది బీఆర్ఎస్ నేతలు పార్టీలో ఉండాలా? వీడాలా? అనే అయోమయంలో పడ్డారు. ఒక్క వేళ పార్టీని వీడితే.. తర్వత పరిణామాలు ఎలా ఉండబోతాయో అనే భయం కూడా పట్టుకుంది. సరిగ్గా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు పట్నం మహేందర్ రెడ్డి. 

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. మరోసారి తిరిగి అధికారంలోకి రావాలని వ్యూహా ప్రతివ్యూహాలతో బీఆర్ఎస్ దూసుకెళ్తుంటే.. మరోవైపు అధికార పార్టీ అసమ్మతి నేతల చేరికలతో కాంగ్రెస్ యాక్టివ్ గా మారింది. బీఆర్ఎస్ లో టికెట్లు దక్కవనే ఉద్దేశంతో కొందరు నేతలు కాంగ్రెస్ లోకి టచ్ లోకి వెళ్తున్నారని సమాచారం. కానీ తానొకటి తలిస్తే.. దైవం ఒకటి తలచింది అన్నట్లు.. ఇటు స్వంత పార్టీలో ఉండలేక.. అటు మరోపార్టీలోకి వెళ్లలేక సమమవుతున్నారు.

సరిగ్గా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి. ఇప్పటికే కాంగ్రెస్ నేతలతో టచ్ లో ఉంటూ.. తనతో పాటుగా తన మద్దతుదారుల సీట్ల గురించి మంతనాలు చేసారనీ, ఆ పార్టీ పెద్దలు కూడా అతనికి అభయం ఇచ్చిందనట్టు ప్రచారం. కానీ, ఇంతలో ప్రగతి భవన్ నుంచి పిలుపు వచ్చిందనీ, హామీల వర్షంతో పాటు భవిష్యత్తు పరిణామాల గురించి కూడా హెచ్చరించినట్టు తెలుస్తుంది. దీంతో పార్టీ అధిష్టానానికి పట్నంగారు జీ హుజూర్ అనక తప్పలేదంట. కానీ, తన నిర్ణయం అనుచర వర్గానికి, మద్దతుదారులకు రుచించటం లేదంట. తన స్వలాభం కోసం బీఆర్ఎస్ లోనే ఉండాలని ఏకపక్షంగా నిర్ణయం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. అసలేం జరిగిందో ఓ లూక్కేద్దాం..

బీఆర్ఎస్ తొలి విడత ప్రభుత్వంలో పట్నం మహేందర్ రెడ్డి మంత్రిగా పనిచేశారు. కానీ, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో తాండూర్ నియోజకవర్గం (బీఆర్ఎస్ తరపున) నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయినా.. ఆయన సీనియార్టీని దృష్టిలో పెట్టుకొని.. బీఆర్ఎస్ హైకమాండ్..ఆయనకు ఎమ్మెల్సీ పదవిని ఇచ్చింది. ఇక్కడ వరకూ అంత బాగానే ఉన్నా.. తన మనుగడనే ప్రశ్నార్థంగా మారుతోందని గమనించలేకపోయారు. అదే 2018 ఎన్నికల్లో ఆయన నియోజకవర్గం(తాండూర్ నియోజకవర్గం)లో నుంచి కాంగ్రెస్ తరుపున పోటీ చేసి.. తనపై గెలిచిన పైలెట్ రోహిత్ రెడ్డి.. ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరారు.

ఈ పరిమాణంతో పట్నం మహేందర్ రెడ్డికి కౌన్ డౌన్ స్టార్ అయ్యింది. ఎలా అంటే.. రోహిత్ రెడ్డి రోజురోజుకు పార్టీలో క్రియాశీలకంగా మారారు. పార్టీ అప్పగించిన ప్రతి పనిని శక్తివంచలేకుండా చేశారు. సీఎం కేసీఆర్ ద్రుష్టిలో మంచి మార్కులు కొట్టేశారు. ఓ రకంగా రోహిత్ రెడ్డి నే బెస్ట్ అనే పరిస్థితికి వచ్చింది. ఈ నేపథ్యంలో ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ టికెట్ అతనికే ఇస్తుందనే ప్రచారం సాగుతోంది. అదే సమయంలో పట్నం మహేందర్ రెడ్డిని పార్టీ దూరం పెట్టబోతుందనే ప్రచారం కూడా మరోవైపు సాగుతోంది. 

ఈ క్రమంలో కాంగ్రెస్ లో చేరేందుకు పట్నం మహేందర్ రెడ్డి రూట్ క్లియర్ చేసుకున్నారు.తనతో పాటుగా తన మద్దతుదారులను కూడా తన బాటలో తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో తనతో పాటు తన మద్దతు దారుల సీట్ల పైన కాంగ్రెస్ లో చర్చించారు. అదే సమయంలో కొందరి సీట్లు ఖరారయ్యాయి అనే టాక్ కూడా వచ్చింది. అందులో వికారాబాద్ కు చెందిన మాజీ మంత్రి చంద్రశేఖర్ కు జహీరాబాద్, తీగల అనితకు మహేశ్వరం, కేఎస్ రత్నం కు చేవెళ్ళ, తాండూరు నుంచి మహేందర్ రెడ్డికి ఇవ్వాలని..మహేందర్ రెడ్డి సతీమణి సునీతకు చేవెళ్ల లోక్ సభ ఇస్తారంటూ ప్రచారం జరిగింది. అంతా సెట్ అయ్యిందర్రా అనుకునే సమయంలోవిషయం ప్రగతి భవన్ కి లీక్ అయింది. దీంతో పార్టీ సీనియర్ నేతల నుంచి ఫోన్ రావడం. పార్టీ వీడితే పరిణామాలు మరోలా ఉంటాయంటూ పరోక్షంగా హెచ్చరికలు వచ్చాయి. దీంతో చేసేంది ఏం లేక పార్టీలోనే కొనసాగుతానని ప్రకటించక తప్పలేదు. 

అనుచరులు, సన్నిహిత నేతలకు కాంగ్రెస్ లోకి వెళ్దామని చెప్పి.. తీరా సమయానికి సమేమిరా అనడంతో వారు కూడా మహేందర్ రెడ్డిపై గుర్రమంటున్నారు. తన స్వలాభం కోసం బీఆర్ఎస్ లోనే ఉండాలని ఏకపక్షంగా నిర్ణయం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. ఇలా ఊహించని పరిణామాలు ఎదురుకావడంతో పట్నం మహేందర్ రెడ్డి పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా మారింది. పైగా బీఆర్ఎస్ అధిష్టానం తనకు ఇచ్చిన హామీ అమలు చేస్తుందా లేదా అనేది కూడా సందేహమే!