హైదరాబాద్ ఫీవర్ ఆస్పత్రిలో రోగులు ఆందోళనకు దిగారు. డాక్టర్లు, అధికారులు తమను పట్టించుకోవడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం నుంచి క్యూలో ఉన్నా... డాక్టర్లు ఇంకా రాలేదని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇదే సమయంలో తమకు చెల్లించాల్సిన 5 నెలల వేతనాలు చెల్లించాలంటూ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు సైతం ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో ఉద్యోగులు, రోగులకు మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది.

ఉద్యోగులు ఆందోళన చేస్తున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదంటూ వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఔట్ సోర్సింగ్ సిబ్బంది ఆందోళనతో రోగులకు వైద్య సేవలు నిలిచిపోయాయి. ఇంత జరుగుతున్నా ఉన్నతాధికారులు మాత్రం ఇంకా స్పందించలేదు.