Asianet News TeluguAsianet News Telugu

కొత్త మేనేజ్ మెంట్ ఆధ్వర్యంలో స్కూల్ నడపాలి:డీఏవీ పేరేంట్స్ డిమాండ్


డీఏవీ స్కూల్  ను  కొత్త  మేనేజ్ మెంట్  తో  నిర్వహించాలని  ఈ స్కూల్లో  విద్యనభ్యసిస్తున్న విద్యార్ధుల పేరేంట్స్  కోరుతున్నారు. ఇప్పటికిప్పుడు  స్కూల్ గుర్తింపు రద్దు  చేస్తే  విద్యార్ధుల  పరిస్థితిపై పేరేంట్స్ ఆందోళన చెందుతున్నారు. 

Parents demands To continue Dav School recognition
Author
First Published Oct 23, 2022, 11:57 AM IST

హైదరాబాద్: డీఏవీ  స్కూల్  ను కొత్త  మేనేజ్  మెంట్  తో  నిర్వహించాలని  ఈ  స్కూల్లో  విద్యనభ్యసిస్తున్న పేరేంట్స్  డిమాండ్  చేస్తున్నారు. ఇప్పటికిప్పుడు  వేరే  స్కూల్లో  విద్యార్ధులను  చేర్పించాలనే  నిర్ణయాన్నిపేరేంట్స్  వ్యతిరేకిస్తున్నారు. 

హైద్రాబాద్  బంజారాహిల్స్ లో  గల డీఏవీ  స్కూల్ లో చదివే  నాలుగేళ్ల  చిన్నారిపై  ప్రిన్సిపాల్ కారు  డ్రైవర్  రజనీకుమార్  లైంగిక దాడికి  పాల్పడ్డాడు. డిజిటల్  క్లాస్  రూమ్ లో చిన్నారిపై  లైంగిక దాడి చేశాడు. ఈ విషయమై  రజనీకుమార్  సహా  స్కూ్  ప్రిన్సిపాల్  పై  పోలీసులు  అరెస్ట్  చేశారు.  మరో వైపు  స్కూల్  గుర్తింపును  రద్దు చేయాలని  ప్రభుత్వం నిర్ణయం  తీసుకుంది. ఈ  స్కూల్లో  చదివే  విద్యార్ధులను  వేరే స్కూల్లో  చదివించాలని  మంత్రి  సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. ఈ  స్కూల్లో  చిన్నారిపై జరిగిన లైంగిక దాడి  ఘటనపై  విద్యా శాఖ అధికారులు  విచారణ  నిర్వహిస్తున్నారు. 

డీఏవీ  స్కూల్  లో  చిన్నారిపై  రజనీకమార్  లైంగిక దాడి  చేసిన విషయమై స్కూల్ ప్రిన్సిపాల్  పట్టించుకోలేదనే  విమర్శలు వెల్లువెత్తాయి. స్కూల్ ప్రిన్సిపాల్  గది పక్కనే  ఉన్న డిజిటల్  రూమ్ ఉంది. అయినా కూడా  ప్రిన్సిపాల్ పట్టించుకోకపోవడంపై  విద్యార్ధిని  పేరేంట్స్  తీవ్ర ఆగ్రహం వ్యక్తం   చేశారు.

రెండు  రోజుల  క్రితం విద్యాశాఖాధికారులు  స్కూల్లో  విచారణ నిర్వహించారు.  విద్యార్ధుల  భవిష్యత్తును  దృష్టిలో  ఉంచుకొని స్కూల్  ను రీ ఓపెన్  చేయాలని  స్కూల్   మేనేజ్ మెంట్ కు  ప్రభుత్వం  తేల్చి చెప్పింది. ఇవాళ ఉదయం   హైద్రాబాద్ కేబీఆర్  పార్క్ వద్ద   విద్యార్ధుల  పేరేంట్స్  సమావేశమయ్యారు.700 మంది విద్యార్ధులను  వేరే స్కూళ్లలో   చేర్పించడంపై  పేరేంట్స్  ఆందోళన  చెందుతున్నారు.  తమకు నచ్చిన స్కూళ్లలో  విద్యార్ధులను  చేర్పించడం సాధ్యమౌతుందా అని  ప్రశ్నిస్తున్నారు.   కొత్త మేనేజ్ మెంట్  సారధ్యంలో  ప్రభుత్వ పర్యవేక్షణలో  స్కూల్  ను నడిపించాలని విద్యార్ధుల  పేరేంట్స్ కోరుతున్నారు.

డీఏవీ  స్కూల్  పేరేంట్స్  రెండు  రోజుల  క్రితం  మంత్రి  సబితా ఇంద్రారెడ్డితో  సమావేశమయ్యారు.  నిన్న  విద్యాశాఖాధికారులతో  భేటీ అయ్యారు.  విద్యాశాఖ  ప్రతిపాదిస్తున్న  ఆఫ్షన్లపై  పేరేంట్స్ ఆందోళన  వ్యక్తం  చేస్తున్నారు.  ఇదిలా ఉంటే ఈ ఘటనకు సంబంధించి  నివేదిక  ఇవ్వాలని  తెలంగాణ ప్రభుత్వాన్ని  గవర్నర్  తమిళిసై సౌందర రాజన్  ఆదేశించారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios