గతంలోనూ పేపర్లు లీకయ్యాయి.. అవి సాధారణమే - మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
గత ప్రభుత్వాల పాలనలోనూ పేపర్లు లీక్ అయ్యాయని, అవి సాధారణంగా జరుగుతూ ఉంటాయని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. టీఎస్ పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీతో సీఎం కేసీఆర్, కేటీఆర్ లకు ఏ సంబంధమూ లేదని ఆయన స్పష్టం చేశారు.
గతంలోనూ పేపర్లు లీకయ్యాయని, అవి సాధారమే అని తెలంగాణ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఇంతకు ముందు పదో తరగతి, ఇంటర్ పరీక్షల పేపర్లు బయటకు వచ్చాయని, అలాగే టీఎస్ పీఎస్సీ లో కూడా జరిగి ఉండవచ్చని ఆయన తెలిపారు. నిర్మల్ లోని తన క్యాంప్ ఆఫీసులో మీడియాతో మంత్రి మంగళవారం మాట్లాడారు.
ములుగులో దారుణం.. మేడారంలోని గోవిందరాజుల గద్దె పూజారి గబ్బగట్ల రవి హత్య..
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నపత్రాల లీకేజీతో ప్రభుత్వానికి ఏం సంబంధం ఉందని అన్నారు. ఇందులో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఏం సంబంధం లేదని చెప్పారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలో పొరపాట్లు జరిగి ఉండవచ్చని తెలిపారు. అయితే దీనిని అనవసరంగా రాద్ధాంతం చేయడం సరికాదని అన్నారు. లీకేజీలో కేసీఆర్, కేటీఆర్‌ల పాత్ర ఉందని కాంగ్రెస్, బీజేపీ ఆరోపిస్తోందని, కానీ వాటికి ఆయా పార్టీల నాయకులు ఆధారాలు చూపాలని తెలిపారు.
జగిత్యాలలో విషాదం.. క్రికెట్ ఆడుతుండగా ఆగిన యువకుడి గుండె
కాగా.. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో ఆయన స్పందించారు. తన మాటలను కావాలనే మీడియాలో వక్రీకరిస్తున్నారని ఆరోపించారు. తన వ్యాఖ్యలను వక్రీకరించకూడదని కోరారు. గత ప్రభుత్వాల పాలనలోనూ ఇలా పేపర్ లీకేజీల ఘటనలు చోటు చేసుకున్నాయని, ఇది సాధారణంగా జరుగుతుంటాయని అనే చెప్పే ఉద్దేశంతో తాను మాట్లాడానని తెలిపారు. కానీ తన వ్యాఖ్యలు మీడియాలో వక్రీకరణకు గురయ్యాయని అన్నారు.