Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణలో పంచాయితీ ఎన్నికలు: ఎలా జరుగుతాయంటే...

రాష్ట్రంలో మొత్తం 1.49 కోట్ల మంది వోట ర్లున్నారు. మొత్తం 12,751  గ్రామ పంచాయితీ లున్నాయి. 2018, మే నాటికి గ్రామీణ ఓటర్లు 1.37 కోట్లు ఉండగా.. ఆ తర్వాత చేరికలతో వారి సంఖ్య 1.49 కోట్లకు చేరింది. 

Panchayat elections in Telangana
Author
Hyderabad, First Published Jan 2, 2019, 4:34 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

జనవరి 21, 25, 30తేదీల్లోపంచాయతీ ఎన్నికలు జరుగుతాయని  షెడ్యూల్‌ విడుదలఅయ్యింది. ఎన్నికలు మూడు విడతల్లో జరగనున్నాయి. పోలింగ్‌ రోజునే  వోట్ల లెక్కింపు జరిపి పలితాలు వెల్లడించనున్నారు . ఫలితాలువెలువడిన  వెంటనే ఉప సర్పంచ్‌ ఎన్నిక జరుగుతుంది. రాష్ట్రంలో మొత్తం 1.49 కోట్ల మంది వోట ర్లున్నారు. మొత్తం 12,751  గ్రామ పంచాయితీ లున్నాయి. 2018, మే నాటికి గ్రామీణ ఓటర్లు 1.37 కోట్లు ఉండగా.. ఆ తర్వాత చేరికలతో వారి సంఖ్య 1.49 కోట్లకు చేరింది. జనవరి  7, 11, 16 తేదీల్లో ఆయా ప్రాంతాల రిటర్నింగ్‌ అధికారులు ఇచ్చే నోటీసులతో నామినేషన్ల పర్వం ప్రారంభమవుతుంది. పోలింగ్‌ ముగిసిన రోజునే ఫలితాలను వెల్లడించి, చేతులెత్తే పద్ధతిలో ఉప సర్పంచి ఎన్నికలను పూర్తి చేస్తారు.

ఇవి పార్టి రహిత ఎన్నికలే కాని పార్టీల పరంగానే జరుగుతాయి, జెండాలు మాత్రం కనిపించవు. ఒక రకంగా పొలిటికల్ లీడర్ల తొలి రిక్రూట్మెంట్ లాంటి సందర్భం ఇది.సర్పంచ్,వార్డ్ మెంబర్లు కలిసి దాదాపు 1,26,000 మంది కొత్తగా రాజకీయాల లోకి వచ్చే అవకాశం ఉంది.ఈ ఎన్నికలలో డబ్బు,పార్టిలతో పాటు కులం ప్రభావం చాల ఉంటుంది.చాల తక్కువ సందర్భాలలోనే ఊరికి ఉపకరించే సర్పంచ్ లు ఎన్నికవుతున్నారు.గ్రామ పాలన సంభందిచి సంస్కరణలు రావాలని అందరు అంటూనే,పాత పద్దతులను కొనసాగించడం ఈ ఎనికలలో కనిపిస్తున్నది. రిజర్వేషన్ల కోటా,నిర్ణయం పై అనేక అబ్యంతరాలను,పెండింగ్ కేసులను పక్కన పెట్టి ఎన్నికలను నిర్వహిస్తున్నారు.క్యాబినెట్  మంత్రులు లేని ముఖ్యమంత్రి అభిష్టమే ఈ ఎన్నికలు.    

రాష్ట్రంలో మొత్తం 12,751 పంచాయతీలు ఉండగా వాటిలో ఇప్పుడు 12,732 పంచాయతీల్లో ఎన్నికలను చేపడున్నారు. ఇంకా గడువు ముగియక పోవడం వల్ల 17 పంచాయతీల్లోను, కోర్టు కేసుల కారణంగా మరో రెండుచోట్ల ఎన్నికలను నిర్వహించడంలేదు. మొత్తం 1,13,170 వార్డుల్లో ఎన్నికలను చేపడతారు. మూడు విడతలుగా ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) నిర్వహిస్తుంది. ఈ షెడ్యూల్‌ ప్రకారం జనవరిలోనే పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది. పంచాయతీల గడువు ముగిసి దాదాపు ఆరు నెలల అయ్యింది.గ్రామ పంచాయితీ ఎన్నికల తేది రావడంతో  రాష్ట్రంలో ఎన్నికల నియమావళి (కోడ్‌) అమలులోకి వచ్చింది.

పంచాయతీ ఎన్నికలను ఎప్పటిలాగే బ్యాలెట్‌ పేపర్‌లపైనే నిర్వహించనున్నారు.అయితే పంచాయతీ పోలింగ్‌ కోసం వాడే బ్యాలెట్‌ పత్రాలపై అభ్యర్థుల పేర్లు, ఫొటోలు ఉండవు. కేవలం గుర్తులు మాత్రమే ఉంటాయి. ఈ మేరకు రాష్ట్రంలో 3.50 కోట్ల బ్యాలెట్‌ పత్రాలను గుర్తులతో ముద్రించి ఎస్‌ఈసీ సిద్ధం చేసుకుంది.

అభ్యర్థుల వ్యయ పరిమితిని కొంత  పెంచారు. గతంలో 10 వేలకు పైగా జనాభా కలిగిన పంచాయతీకి సర్పంచ్‌ అభ్యర్థులు రూ.80 వేలు, వార్డు సభ్యులు రూ.10 వేల వరకు ఖర్చు చేసేలా పరిమితి ఉంది. పదివేల లోపు జనాభా ఉన్న గ్రామాలకు.. సర్పంచ్‌ అభ్యర్థులకు రూ.40 వేలు, వార్డు సభ్యులకు రూ.5 వేలు వ్యయ పరిమితి ఉండేది.

 రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల్లో 1,49,52,058 మంది ఓటర్లు ఉన్నారు. నవంబరు 19 నుంచి పంచాయతీ షెడ్యూల్‌ జారీ చేసే జనవరి 1 నాటికి ఓటరు జాబితాలో చేరిన వారిని రెండో అనుబంధ జాబితాగా చేర్చనున్నారు.గత  స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి ఎన్నికల ఖర్చులను సమర్పించని  12,745వారిపై రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) ఈ సారి పోటీకి అనర్హత వేటు వేసింది.ఇప్పటికే 3.36 కోట్ల బ్యాలెట్‌ పత్రాలను ముద్రించారు. పోలింగ్‌కు 92,223 బ్యాలెట్‌ పెట్టెలను ఉపయోగిస్తున్నారు. పోలింగ్‌ ఉదయం 7 గంటలకు మొదలై మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగుతుంది.

ఖమ్మం రూరల్‌ మండలంలోని ఐదు పంచాయతీలను ఖమ్మం కార్పొరేషన్‌లో విలీనం చేస్తున్నట్టు గతంలో ప్రభుత్వం ప్రకటించింది. ఈ విలీనాన్ని వ్యతిరేకిస్తూ ఐదు  గ్రామాలవారు హైకోర్టును ఆశ్రయించడంతో విలీనాన్ని తాత్కాలికంగా ఆపాలంటూ న్యాయస్థానం స్టే ఇచ్చింది. ఈ పంచాయతీల విలీనంపై ఎటువంటి నిర్ణయమూ తీసుకోకపోవడంతో ఆ పంచాయతీలకు ఎన్నికలు జరిగే పరిస్థితి లేదు.

- దుర్గం రవిందర్

Follow Us:
Download App:
  • android
  • ios