తెలంగాణ సరిహద్దుల్లో రోడ్డుపైనే ధాన్యం లారీలు: ఇతర రాష్ట్రాల ధాన్యం వాహనాలకు నో ఎంట్రీ


తెలంగాణ సరిహద్దుల్లో ఇతర రాష్ట్రాల నుండి వరి ధాన్యం లారీలు రాకుండా పోలీసులు అడ్డుకొంటున్నారు. ఈ మేరకు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వరి ధాన్యం లారీలను నిలిపివేశారు.
 

Paddy Trucks denied Entry Into Telangana


హైదరాబాద్: Telangana సరిహద్దుల్లో  Paddy ధాన్యం లారీలు లు నిలిచిపోయాయి. ఇతర రాష్ట్రాలకు చెందినధాన్యం లారీలను పోలీసులు అడ్డుకుంటున్నారు. దీంతో తెలంగాణ సరిహద్దుల్లోనే ధాన్యం లారీలు నిలిచిపోయాయి. కొన్ని లారీలను స్వంత రాష్ట్రాలకు తిప్పి పంపిస్తున్నారు పోలీసులు.

తెలంగాణలో రైతుల నుండి వరి ధాన్యం కొనుగోలును రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్ 15న ప్రారంభించింది. ఏప్రిల్ 12న కేబినెట్ సమావేశంలో  రాష్ట్రంలో రైతాంగం నుండి వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు ఇతర రాష్ట్రాలకు సరిహద్దులు ఉన్న జిల్లాల వద్ద చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. గట్టి నిఘాను కొనసాగిస్తున్నారు. 

ఏ గ్రేడ్ వరి ధాన్యానికి రూ. 1960, సాధారణ వరి ధాన్యానికి రూ. 1940 చెల్లించనున్నారు. రాష్ట్రంలో  6920 ధాన్యం కొనుగోలు కేంద్రాలను కేసీఆర్ సర్కార్ ఏర్పాటు చేసింది. ఈ కొనుగోలు కేంద్రాల ద్వారా వరిని కొనుగోలు చేస్తున్నారు. వరి విక్రయించిన రైతుల బ్యాంకు ఖాతాల్లో రెండు రోజుల్లో నగదును జమ చేసేలా అధికారులు చర్యలు తీసుకొన్నారు. రాష్ట్రంలో 35.80 లక్షల ఎకరాల్లో వరి పంటను పండించారు. అయితే 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించేందుకు తెలంగాణ ప్రభుత్వం రంగం సిద్దం చేసుకొంది. ధాన్యం  నింపేందుకు గాను 15 కోట్ల గన్నీ బ్యాగులు అవసరమౌతాయని తెలంగాణ ప్రభుత్వం  జూట్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియాకు సమాచారం పంపింది.

రాష్ట్రంలో Farmers నుండి ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేస్తున్నందున ఇతర రాష్ట్రాల నుండి ధాన్యం రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకొంటున్నారు.రాష్ట్రంలో ఏ రైతు ఏ పంట వేశారనే సమాచారం కూడా వ్యవసాయశాఖాధికారుల వద్ద ఉంది. ఇతర రాష్ట్రాలు లేదా ఇతర ప్రాంతాల నుండి వచ్చి రాష్ట్రంలో ధాన్యం విక్రయించే అవకాశాలు లేవు. ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన ధాన్యాన్ని రాష్ట్రంలో విక్రయించినా పట్టేస్తామని కూడా అధికారులు చెబుతున్నారు. ఇతర రాష్ట్రాల నుండి ధాన్యం రాకుండా చర్యలు తీసుకొంటేనే మంచిదని భావించిన అధికారులు సరిహద్దుల వద్ద చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు.

ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి మెదక్ జిల్లాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. కర్ణాటక, ఏపీ రాష్ట్రాల నుండి వస్తున్న ధాన్యం లారీలను పోలీసులు వెనక్కి పంపుతున్నారు.

రాష్ట్రంలో యాసంగి సీజన్ లో నూకలు ఎక్కువగా అవుతాయి. ఉష్ణోగ్రతలు పెరగడంతో నూకలు ఎక్కువగా అవుతాయి. సాధారణంగా క్వింటాలు వరి ధాన్యం మిల్లింగ్ చేస్తే 50 కిలోల బియ్యం 17 కిలోల నూకలు వస్తాయి. అదే యాసంగిలో అయితే క్వింటాల్  వరిని మిల్లింగ్ చేస్తే 17 కిలోల నూకలకు మరో 17 కిలోలు తోడౌతాయి. అంటే బియ్యం 36 కిలోలు మాత్రమే వస్తాయి.
బియ్యాన్ని ఎఫ్‌సీఐకి ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తుంది.  నూకలను ఏం చేయాలనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని సమాచారం. ప్రతి క్వింటాల్  పై ప్రభుత్వానికి రూ.400 నుండి రూ.500 భారం పడే అవకాశం ఉందని సమాచారం.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios