Asianet News TeluguAsianet News Telugu

టీ. కాంగ్రెస్‌లో అసంతృప్తి జ్వాలలు : గాంధీభవన్‌పై విష్ణువర్ధన్ రెడ్డి అనుచరుల దాడి, రేవంత్ ఫ్లెక్సీలు దహనం

దివంగత పీజేఆర్ తనయుడు విష్ణువర్ధన్ రెడ్డికి జూబ్లీహిల్స్ టికెట్ నిరాకరించడంతో ఆయన వర్గీయులు రగిలిపోతున్నారు. ఈ నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం విష్ణువర్ధన్ రెడ్డి అనుచరులు గాంధీభవన్‌పై కర్రలు, రాళ్లతో దాడికి దిగారు.

p vishnuvardhan reddy followers attack on telangana congress head office gandhi bhavan ksp
Author
First Published Oct 28, 2023, 5:24 PM IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన సెకండ్ లిస్ట్‌లో చోటు దక్కని అసంతృప్తులు అధిష్టానంపై మండిపడుతున్నారు. కొందరు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అటు దివంగత పీజేఆర్ తనయుడు విష్ణువర్ధన్ రెడ్డికి జూబ్లీహిల్స్ టికెట్ నిరాకరించడంతో ఆయన వర్గీయులు రగిలిపోతున్నారు. ఈ నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం విష్ణువర్ధన్ రెడ్డి అనుచరులు గాంధీభవన్‌పై కర్రలు, రాళ్లతో దాడికి దిగారు. అక్కడే వున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫ్లెక్సీలు, బ్యానర్‌లు తగులబెట్టారు. తీవ్ర ఉద్రిక్త పరిస్ధితులు నెలకొనడంతో అక్కడికి పోలీసులు చేరుకుని అదుపు చేస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

ALso Read: కాంగ్రెస్‌లో జూబ్లీహిల్స్ టిక్కెట్టు పంచాయితీ:విష్ణు వ్యతిరేక వర్గంతో అజహరుద్దీన్ భేటీ

కాంగ్రెస్ రెండో జాబితాలో జూబ్లీహిల్స్ టికెట్ తనకు రాకపోవడం పై విష్ణువర్ధన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అజారుద్దీన్ కి జూబ్లీహిల్స్ టికెట్ ఇచ్చింది. దీంతో మనస్తాపం చెందిన పీజేఆర్ కొడుకు విష్ణువర్ధన్ రెడ్డి కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. ఖైరతాబాద్ నుంచి పీజేఆర్ కుమార్తె విజయారెడ్డికి టికెట్ ఇచ్చిన కాంగ్రెస్.. జూబ్లీహిల్స్ లో విష్ణువర్ణన్ కు టికెట్ ఇవ్వలేదు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ టికెట్ ను మాజీ క్రికెటర్ అజహరుద్దీన్ కు కేటాయించింది. దీంతో అసంతృప్తి వ్యక్తం చేసిన విష్ణువర్ణన్ రెడ్డి తన అనుచరులతో సమావేశం అయి, చర్చించిన తరువాత తదుపరి నిర్ణయం ప్రకటిస్తానని తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios