Asianet News TeluguAsianet News Telugu

మహబూబ్‌నగర్ బీజేపీ టికెట్ బరిలో మాజీ మంత్రి పీ చంద్రశేఖర్.. టికెట్ కోసం దరఖాస్తు

మహబూబ్ నగర్ నుంచి బీజేపీ టికెట్ కోసం మాజీ మంత్రి పీ చంద్రశేఖర్ బరిలో ఉన్నారు. ఆయన బీజేపీ టికెట్ కోసం ఈ రోజు దరఖాస్తు చేసుకున్నారు. టీడీపీ హయాంలో పలుశాఖలకు మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన అనుభవం ఆయన సొంతం. ప్రధానమంత్రి మోడీ కూడా ఓ సమావేశంలో కలిసి ముందుకు సాగాలని సూచనలు చేశారు.
 

p chandrasekhar applied for bjp ticket from mahabubnagar constituency for telangana assembly poll kms
Author
First Published Sep 10, 2023, 7:15 PM IST

మహబూబ్‌నగర్: మాజీ మంత్రి, బీజేపీ లీడర్ పొడపాటి చంద్రశేఖర్ ఎన్నికల బరిలోకి దిగాలని నిర్ణయం తీసుకున్నారు. బీజేపీ టికెట్ పై మహబూబ్ నగర్ స్థానం నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలని ఆలోచిస్తున్నారు. ఇందుకోసమే ఆయన బీజేపీ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.

పి చంద్రశేఖర్ వివాదరహితుడిగా, కలుపుకుయే స్వభావం కలిగిన దైవభక్తి పారాయణుడు. హిందూ ధర్మం పట్ల నిబద్ధత కలిగి ఉన్న నేత. గతంలో ఎమ్మెల్యేగా మంత్రిగా సేవలు అందించిన అనుభవం ఆయన సొంతం. అందుకే ఆయన టికెట్ కోసం దరఖాస్తు చేసుకోవడం ఒక కీలక పరిణామంగా చూస్తున్నారు.

పొడపాటి చంద్రశేఖర్ టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఆర్టీసీ, న్యాయశాఖ, భారీ పరిశ్రమలు వంటి ముఖ్యమైన పదవుల్లో పని చేశారు. సీనియర్ ఎన్టీఆర్‌కు పి చంద్రశేఖర్ అనుచరుడిగా కూడా ఆయనకు గతంలో పేరొచ్చింది. ఆయన ఏ పదవిని అలంకరించినా దానికి వన్నె తెచ్చారు.

Also Read : ఇప్పుడే పిల్లలు వద్దని పుట్టినింటికి వెళ్లిన భార్య.. భర్త ఆత్మహత్య.. కోర్టు ఏం తీర్పు ఇచ్చిందంటే?

2019 పార్లమెంటు ఎన్నికల సందర్భంలో ఆయన బీజేపీలోకి వచ్చారు. పార్టీలో క్రియాశీలకంగా పని చేస్తున్నారు. ఓసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా స్వయంగా పి చంద్రశేఖర్‌ను పొగిడారు. ప్రత్యేకంగా మాట్లాడి ముందుకు సాగాలని సూచించారు. ఘన మైన చరిత్ర కలిగిన చంద్రశేఖర్ ఇప్పుడు బీజేపీ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. మరికొన్ని రోజుల్లో ఆయన అభ్యర్థిత్వంపై స్పష్టత రానుంది.

Follow Us:
Download App:
  • android
  • ios