Asianet News TeluguAsianet News Telugu

సిద్దిపేటలో దారుణం.. విషం ఇంజక్షన్లతో వందకు పైగా కుక్కల మృతి...

వీధి కుక్కలకు విషపు ఇంజక్షన్లు ఇచ్చి చంపిన ఉదంతం ఇప్పుడు సిద్దిపేట జిల్లాలో కలకలం రేపుతోంది. దాదాపు వందకు పైగా కుక్కలు ఇలా మరణించాయి.

Over a hundred dogs killed by poison injections in siddipet
Author
Hyderabad, First Published Mar 29, 2022, 11:48 AM IST

జగదేవ్ పూర్ : మూగజీవాల పట్ల విశ్వాస ఘాతుకమిది. poison injections ఇవ్వడంతో వందకు పైగా dogs మృతి చెందిన ఘటన సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం తీగుల్ గ్రామంలో జరిగింది.  గ్రామస్తుడొకరు తన పెంపుడు dog చనిపోవడంతో హైదరాబాదులోని స్టే యానిమల్ ప్రొటెక్షన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా స్వచ్ఛంద సంస్థకు తెలిపారు. సంస్థ సభ్యులు ఆదివారం రాత్రి గ్రామానికి వచ్చి విచారించగా అసలు విషయం వెల్లడైంది. సంస్థ ప్రతినిధులు శశికళ, గౌతమ్ పలు వివరాలను విలేకరులకు వెల్లడించారు. కుక్కల బెడదపై గ్రామస్తులు పలుమార్లు పంచాయతీకి ఫిర్యాదు చేయడంతో…  సర్పంచ్  కప్పర భాను ప్రకాష్ రావు, పంచాయతీ కార్యదర్శి రాజగోపాల్ ఇద్దరూ కలిసి కుక్కలకు విషపు ఇంజెక్షన్లు ఇప్పించారు. 

విషం వల్ల వందకుపైగా లక్షణాలు చనిపోయాయని, వాటి కళేబరాలను గ్రామ పరిసరాల్లోని పాత బావుల్లో వేసి పూడ్చివేశారని తెలిపారు. ఈ విషయం మీద జగదేవ్ పూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడానికి వెళ్లగా పోలీసులు స్పందించలేదు అన్నారు. దీన్ని వారు జాతీయ జంతు సంరక్షణ సంస్థ ప్రతినిధి మేనకా గాంధీ దృష్టికి తీసుకువెళ్లారు. తీగుల్ లో కుక్కలకు విషం ఇంజక్షన్లు ఇది చంపినట్లు ఫిర్యాదు రాగా సర్పంచి, కార్యదర్శిపై సోమవారం కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ కృష్ణమూర్తి తెలిపారు. 

ఇదిలా ఉండగా, జనవరి 27న ఉత్తరప్రదేశ్ లో దారుణం జరిగింది. ఓ మ‌హిళపై వీధి కుక్క‌లు దాడి చేశాయి. దీంతో ఆమె తీవ్ర‌గాయాల‌పాలైంది. స్థానికులు వెంట‌నే హాస్పిట‌ల్ కు తీసుకెళ్లే క్ర‌మంలోనే ఆమె మృతి చెందింది. ఈ ఘ‌ట‌న అమ్రోహా జిల్లాలోని హసన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బిజ్‌నౌరా గ్రామంలో జ‌రిగింది. బిజ్ నౌరా గ్రామానికి చెందిన 30 ఏళ్ల నథియా ఆ రోజు సాయంత్రం పశువులకు మేత వేసి ఇంటికి తిరిగి వ‌స్తోంది. ఈ క్ర‌మంలో ఆమెపై వీధి కుక్కలు ఎగ‌బ‌డ్డాయి. వాటి బారి నుంచి త‌ప్పించుకునేందుకు ఆమె ఎంతో ప్ర‌య‌త్నం చేసినా అవేవీ ఫ‌లించ‌లేదు. కుక్క‌లు విప‌రీతంగా రెచ్చిపోయి ఆమెను తీవ్రంగా క‌రిచాయి. ఆమె ముఖం, గొంతు, కడుపుపై ​​గాయాలు చేశాయి. దీనిని గ‌మ‌నించిన స్థానికులు అక్క‌డికి చేరుకున్నారు. కానీ ఆలోపే మహిళ స్పృహ కోల్పోయింది. హాస్పిట‌ల్ కు తరలించే మార్గంలో ఆమె మరణించింది.

జనవరి నెల మొద‌ట్లో మ‌ధ్య ప్ర‌దేశ్ లో కూడా ఇలాంటి ఘ‌ట‌నే జ‌రిగింది. భోపాల్‌ లోని అంజలి విహార్ కాలనీలో కుక్కల దాడిలో నాలుగేళ్ల బాలిక తీవ్రంగా గాయపడింది. గాయపడిన బాలికను చికిత్స కోసం వెంట‌నే హాస్పిట‌ల్ కు తీసుకెళ్లారు. ఈ భయానక దాడి సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. ఇందులో దృష్యాలు అంద‌రినీ క‌లిచివేశాయి. ఈ దాడిలో ఐదు కుక్కలు పాప‌ను వెంబడించినట్లు క‌నిపించాయి. పాపపై కుక్క‌లు దాడి చేస్తున్నాయ‌నుకున్న క్ర‌మంలోనే ఆమె భయంతో పారిపోవడానికి ప్రయత్నించింది. కానీ బ్యాలెన్స్ తప్పి కింద పడిపోయింది. ఆ తర్వాత కుక్కలు ఆమెను చుట్టుముట్టి క‌ర‌వ‌డం ప్రారంభించాయి. దీనిని గ‌మ‌నించిన ఓ వ్య‌క్తి తరువాత కుక్కలను తరిమికొట్టాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios