Asianet News TeluguAsianet News Telugu

ఓయూలో రాహుల్ సభకు నో

ఈ నెల 14వ తేదీన ఓయూలో నిర్వహించతలపెట్టిన  సభకు ఓయూ వీసీ అనుమతి నిరాకరించారు. రెండు రోజుల పాటు తెలంగాణలో రాహుల్ పర్యటించనున్నారు.ఇందులో భాగంగా ఓయూలో రాహుల్ సభను ఏర్పాటు చేశారు.ఈ సభకు వీసీ అనుమతి నిరాకరించారు.

Osmania VC denies to permission Rahul sabha
Author
Hyderabad, First Published Aug 10, 2018, 3:23 PM IST


హైదరాబాద్: ఈ నెల 14వ తేదీన ఓయూలో నిర్వహించతలపెట్టిన  సభకు ఓయూ వీసీ అనుమతి నిరాకరించారు. రెండు రోజుల పాటు తెలంగాణలో రాహుల్ పర్యటించనున్నారు.ఇందులో భాగంగా ఓయూలో రాహుల్ సభను ఏర్పాటు చేశారు.ఈ సభకు వీసీ అనుమతి నిరాకరించారు.

ఈ నెల 13, 14 తేదీల్లో  తెలంగాణ జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటిస్తున్నారు..ఈ నెల 13 వతేదీన  రంగారెడ్డి జిల్లాలో నిర్వహించే బస్సు యాత్రలో ఆయన పాల్గొంటారు.  ఈ నెల 14 వతేదీన ఓయూలో జరిగే  సభలో రాహుల్ పాల్గొనేలా  ఆ పార్టీ ప్లాన్ చేసింది.

అయితే ఓయూలో సభకు అనుమతివ్వాలని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే  ఓయూ వీసీని కోరింది.  అయితే సభ నిర్వహణ విషయమై  కొన్ని విద్యార్థి సంఘాలు అభ్యంతరం చెప్పాయి.  రాహుల్‌గాంధీ సభను అడ్డుకొంటామని ప్రకటించింది.ఈ తరుణంలో  మరోసారి  ఠాగూర్ ఆడిటోరియంలో జరిగే సదస్సులో రాహుల్‌ ప్రసంగించేలా మరో కార్యక్రమానికి ప్లాన్ చేశారు.

అయితే ఈ కార్యక్రమం విషయమై అనుమతి ఇవ్వాలని కూడ కోరారు.  ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ  అనుబంధ విద్యార్థిసంఘం వీసీని అనుమతి కోరింది. అయితే  ఈ విషయమై  అనుమతిని నిరాకరించారు  వీసీ రామచంద్రం

ఈ మేరకు కొద్దిసేపటి క్రితమే కాంగ్రెస్ పార్టీ అనుబంధ విద్యార్థి సంఘానికి వీసీ రామచంద్రం రాహుల్ గాంధీ సభకు అనుమతిని నిరాకరిస్తున్నట్టు లేఖను అందించారు. సెక్యూరిటీ కారణాలను చూపి అనుమతి ఇవ్వలేమని రామచంద్రం ప్రకటించారు. అయితే ఈ విషయమై టీపీసీపీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ విషయమై కోర్టుకు వెళ్లాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. 

 

Follow Us:
Download App:
  • android
  • ios