రాహుల్ గాంధీ మీటింగ్ కి అనుమతి నిరాకరణ: మినిస్టర్స్ క్వార్టర్స్ ను ముట్టడించిన విద్యార్ధులు

ఉస్మానియా యూనివర్శిటీలో రాహుల్ గాంధీ టూర్ కి అనుమతివ్వకపోవడంతో  మినిస్టర్ క్వార్టర్స్ ను విద్యార్ధి సంఘ నేతలు ముట్టడించారు. క్వార్టర్స్ లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు.

Osmania Students Protest In front Of Ministers Quarter Gate For Permission To Rahul Tour In OU

హైదరాబాద్:  ఉస్మానియా యూనివర్శిటీలో ఎఐసీసీ మాజీ చీఫ్ Rahul Gandhi  టూర్ కి అనుమతివ్వాలని డిమాండ్ చేస్తూ ఆదివారం నాడు హైద్రాబాద్ లో Minister Quarters  ను ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్ధులు ముట్టడించేందుకు ప్రయత్నించారు. ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్ధులను పోలీసులు అరెస్ట్ చేశారు.

మే 6వ తేదీన Warangal జిల్లాలో జరిగే సభలో రాహుల్ గాంధీ పాల్డొంటారు. ఈ నెల 7న Hyderabad లో జరిగే కార్యకర్తల సమావేశంలో రాహుల్ గాంధీ పాల్గొంటారు. అయితే అదే రోజున రాహుల్ గాంధీతో Osmnia Universityలో  కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని Congress  పార్టీ నేతలు భావించారు. అయితే ఈ విషయమై  కాంగ్రెస్ పార్టీ నేతలు  ఉస్మానియా యూనివర్శిటీ వీసీని కోరారు. ఉస్మానియా యూనివర్శిటీ గవర్నరింగ్ బాడీ సమావేశంలో రాహుల్ గాంధీ పర్యటనకు సంబంధించి చర్చించారు.  ఈ టూర్ కి అనుమతి ఇవ్వకూడదని నిర్ణయం తీసుకొన్నారు.ఈ నిర్ణయాన్ని నిరసిస్తూ  ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్ధులు ఆదివారం నాడు మినిస్టర్స్ క్వార్టర్స్ ను ముట్టడించారు బాల్క సుమన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాహుల్ గాంధీ టూర్ కి అనుమతివ్వకపోవడం TRS కుట్రే అంటూ విమర్శలు చేశారు. మినిస్టర్స్ క్వార్టర్స్  గేట్ దూకి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన  విద్యార్ధులను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ నెల 7వ తేదీన ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్ధులతో రాహుల్ గాంధీ సమావేశాన్ని కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేసింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమానికి ఉస్మానియి యూనివర్శిటీ వేదికగా మారింది. అయితే ఈ యూనివర్శిటీకి చెందిన కొందరు నేతలు రాహుల్ గాంధీని యూనివర్శిటీకి తీసుకురావాలని రేవంత్ రెడ్డికి గత మాసంలో వినతి పత్రం ఇచ్చారు.ఈ రాహుల్ తో ఓయూ విద్యార్ధుల సమావేశం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకొంది. ఈ బాధ్యతలను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డికి అప్పగించింది. ఓయూ వీసీకి కాంగ్రెస్ పార్టీ అనుమతి కోసం లేఖను కూడా ఇచ్చింది. అయితే ఓయూ గవర్నింగ్ బాడీ సమావేశంలో రాహుల్ టూర్కి అనుమతి విషయమై చర్చించారు.. ఈ  మీటింగ్ కి అనుమతి ఇవ్వవద్దని తేల్చారు. 

ఈ నెల 7వ తేదీన ఉస్మానియా యూనివర్శిటీలో విద్యార్ధులతో  రాహుల్ గాంధీ సమావేశం ఏర్పాటుకు కాంగ్రెస్ ప్లాన్ చేసింది. అయితే రాహుల్ గాంధీ సభకు ఓయూ గవర్నరింగ్ బాడీ అనుమతి ఇవ్వలేదు. రాజకీయ పార్టీల సమావేశాలు అనుమతిని ఇవ్వకూడదని గతంలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా రాహుల్ గాంధీ మీటింగ్ కి అనుమతి ఇవ్వలేదని ఓయూ అధికారులు తెలిపారు.

అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రాహుల్ మీటింగ్ కి అనుమతి ఇవ్వలేదని కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఓయూలో రాహుల్ గాంధీ సభకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డిని ఇంచార్జీగా నియమించారు. దీంతో ఓయూ విద్యార్ధులను అరెస్ట్ చేసిన విషయం తెలుసుకొన్న జగ్గారెడ్డి వారిని పరామర్శించేందుకు వెళ్లారు. దీంతో జగ్గారెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు ఇలా చేస్తున్నారని జగ్గారెడ్డి విమర్శించారు.

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios