Asianet News TeluguAsianet News Telugu

ఉస్మానియా ఆసుపత్రి బిల్డింగ్ చారిత్రకమైందా.. కాదా?: ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు

 ఉస్మానియా ఆసుపత్రి భవనం చారిత్రకమైందా ... కాదా అని తేల్చి చెప్పాలని తెలంగాణ హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఉస్మానియా ఆసుపత్రి భవనం కూల్చివేత విషయంలో భిన్న వాదనలున్నాయని హైకోర్టు ఈ సందర్భంగా గుర్తు చేసింది.

Osmania hospital building heritage or not asks Telangana High court
Author
Hyderabad, First Published Jul 23, 2020, 1:34 PM IST


హైదరాబాద్: ఉస్మానియా ఆసుపత్రి భవనం చారిత్రకమైందా ... కాదా అని తేల్చి చెప్పాలని తెలంగాణ హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఉస్మానియా ఆసుపత్రి భవనం కూల్చివేత విషయంలో భిన్న వాదనలున్నాయని హైకోర్టు ఈ సందర్భంగా గుర్తు చేసింది.

ఉస్మానియా ఆసుపత్రికి  కొత్త భవన నిర్మాణం, పాత భవనం కూల్చివేతపై దాఖలైన పిటిషన్ పై గురువారం నాడు తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది. ఉస్మానియా ఆసుపత్రి భవనం శిథిలావస్థకు చేరుకొంది. ఈ భవనాన్ని సీజ్ చేయాలని డీఎంఈ రమేష్ రెడ్డి ఈ నెల 22వతేదీన ఆదేశాలు జారీ చేశారు.పాత భవనంలోని పలు విభాగాలను పక్క భవనంలోకి మార్చారు.

also read:ఉస్మానియా పాత భవనం సీజ్, డిపార్ట్‌మెంట్లు కొత్త భవనంలోకి: డీఎంఈ రమేష్ రెడ్డి

ఉస్మానియా ఆసుపత్రి మరమ్మత్తుల కోసం రూ. 6 కోట్లను కేటాయించినట్టుగా ప్రభుత్వ తరపు న్యాయవాది హైకోర్టుకు వివరించారు. అయితే మరమ్మత్తుల పురోగతిని ప్రభుత్వం నుండి తెలుసుకొని చెబుతానని ఆయన హైకోర్టుకు తెలిపారు. ఈ కేసు విచారణను ఆగష్టు 4వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది. 

ఈ నెల 14, 15 తేదీల్లో వర్షాలకు ఉస్మానియా ఆసుపత్రిలోకి భారీగా వర్షం నీరు చేరింది. ఇవాళ కురిసిన వర్షానికి కూడ పాత భవనంలోకి నీరు చేరింది. ఇప్పటికే ఈ భవనం పై కప్పు నుండి పెచ్చులూడి కిందపడుతున్నాయి.భయం భయంతోనే వైద్యులు, రోగులు ఈ భవనంలో ఉంటున్నారు. అయితే డీఎంఈ ఆదేశాల మేరకు పాత భవనాన్ని ఖాళీ చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios